సోనూసూద్ కు ముంబై ప్రభుత్వం ఝలక్.. అసలేమైందంటే..?

కరోనా సెకండ్ వేవ్ లో ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల కంటే సరైన సమయంలో మందులు లభ్యం కాకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది.అయితే మందులు అవసరమైన ప్రజలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కోరిన వెంటనే ఆ మందులు వారికి చేరుతున్నాయి.

 How Celebrities Politicians Got Covid Drugs Bombay High Court,latest News Viral-TeluguStop.com

సెలబ్రిటీల దగ్గర యాంటీ కోవిడ్ డ్రగ్స్ ఉండటంతో సోనూసూద్ కు మహారాష్ట్ర సర్కార్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి సోనూసూద్ తన వంతు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కరోనాకు వాడే మందుల విషయంలో అథారిటీ ఉండగా సెలబ్రిటీలకు మందులు, ఇంజక్షన్లు ఎలా వస్తున్నాయని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సెలబ్రిటీల ఆలోచన మంచిదే అయినా వారికి ఏ విధంగా మందులు దొరుకుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.

Telugu Covid Drugs, Mumbai, Politicians, Sonusood-Movie

మందులను అధికారికంగానే సెలబ్రిటీలు సమకూరుస్తున్నారా.? లేక బ్లాక్ మార్కెటింగ్ ద్వారా సెలబ్రిటీలకు మందులు అందుతున్నాయా.? అని ముంబై హైకోర్టు ప్రశ్నించింది.కొన్ని కంపెనీలు కేంద్రానికి మాత్రమే మందులను అందిస్తుండగా ఆ మందులు ఏ విధంగా సెలబ్రిటీలకు చేరుతున్నాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది.

యాంటీ కరోనా డ్రగ్స్ విషయంలో లోతుగా విచారణ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది.

Telugu Covid Drugs, Mumbai, Politicians, Sonusood-Movie

మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ తో పాటు మరి కొందరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఈ నోటీసుల విషయంలో సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మందుల బ్లాక్ మార్కెటింగ్ వల్లే సరైన సమయంలో రోగులకు మందులు అందడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఈ ఆరోపణలు నిజమో కాదో తెలియాలంటే సెలబ్రిటీలు స్పందించే వరకు ఆగాల్సిందే.సెలబ్రిటీలతో పాటు ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దికీకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube