ఇంత పెద్ద ఊరికి ఒక్కరే హెల్పర్ ఎట్లా ఉంటాడు?అని సెస్ ఏ ఈ నీ నిలదీసిన మాజీ ఎంపీటీసీ,రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల( Farmers ) ప్రాణాలు గాలిలొ కలిసిపోయిన పర్వాలేదా?పంట పొలాల్లో లూజు లైన్ విద్యుత్ తీగలు ఉంటే ఎందుకు సరి చేయరు.

మిడిల్ పోల్స్ ఎందుకు వేయడం లేదు.

ఇంత పెద్ద ఊరికి ఒక్కరే హెల్పర్ ఉంటే విద్యుత్ బ్రేక్ డౌన్ సమస్యలు ఎట్లా తీరుతాయని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు రైతులు సెస్ ఏ ఈ పృథ్విధర్ ను నిలదీశారు.బుదవారం స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balraj yadav ) ఆధ్వర్యంలో రైతులు, గృహ వినియోగదారులు ఎల్లారెడ్డిపేటలో గల సెస్ కార్యాలయానికి వెళ్లి సెస్ ఏ ఈ నీ నిలదీశారు.

సెస్ అధికారుల పనితీరుకు నిరసనగా సెస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.మండల కేంద్రము లో పంట పొలాల్లో విద్యుత్ తీగలు ఉయ్యాల లాగ వేలాడుతున్న ఎందుకు వాటిని సరిచేయడం లేదని ఏ ఈ నీ ప్రశ్నించారు.

మిడిల్ పోల్స్ గురించి రైతులు వచ్చి కావాలని అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని, ఎల్లారెడ్డి పేటలో 8000 గృహవసరాల విద్యుత్ మీటర్లు ఉండగా గతంలో ఇద్దరు హెల్పర్లు ఉండగా గంభీరావుపేట నుండి వచ్చిన రాజ లింగం అనే హెల్పర్ ను ఇక్కడి నుండి ఎందుకు బదిలీ చేశారని కేవలం ఒక్క హెల్పర్ వెంకటేష్ ఉండడం వల్ల వ్యవసాయ, గృహవసరాల బ్రేక్ డౌన్ లు సరిచేయడం ఒక్కడికి పనికి మించిన భారం అవుతుందనీ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ ఏ ఈ తో అన్నారు.మీరు చెప్పింది నిజమే 24గంటల లోపు పర్మినెంట్ హెల్పర్ ను రాజలింగం స్థానంలో విధుల్లోకి తీసుకుంటానని ఏ ఈ హామీ ఇచ్చారు.

Advertisement

గృహ జ్యోతి( Gruha Jyothi ) కింద దరఖాస్తు గతంలో చేసుకోలేని వారు ఇప్పుడు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనీ దీనికి సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరగా ఎంపిడిఓ సత్తయ్య దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.గత 15రోజుల క్రితం గ్రామంలో 1,2 వ వార్డులలో హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాళిపోయాయని ఇట్లాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు నష్ట పరిహారం అందించేలా సెస్ పాలకవర్గం తీర్మాణించాలని సెస్ ఏ ఈ కి ఇచ్చిన వినతి పత్రం లో పేర్కొన్నారు.

వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి గ్రామ పంచాయతీ కి వస్తె అయిదు రోజులు మాత్రమే బిల్లులు తీసుకుంటున్నారని ఇది వారం రోజుల పాటు తీసుకునేలా చూడాలనీ అందులో ఒక రోజు డబల్ బెడ్ రూం లలో,కిష్టంపల్లి లో నివాసముంటున్న వారి కోసం ఒక రోజు కేటాయించి అక్కడే బిల్లుల కౌంటర్ చెల్లింపు కేంద్రం ఏర్పాటు చేయాలని సెస్ ఏ ఈ నీ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.ప్రతి రోజు కరెంట్ తీసివేయకుండా చూడాలని కోరారు.

ప్రజా పాలన లో గత మూడు నెలల పాటు జీరో బిల్లు వచ్చి ఇప్పుడు బిల్లులు ఎందుకు వస్తున్నాయని దీనిపై విచారణ చేయాలని కోరారు.మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, దీటి బాలయ్య,,బాద శ్రీనివాస్, గౌరిగారి గోపి, దీటి మురళీ, నేవూరి రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి,రాగుల శ్రీకాంత్ రెడ్డి, గుండాడి శ్రీనివాస్ రెడ్డి, కటకం దేవయ్య, ఎండపల్లి అరుణ్ కుమార్,శ్రీరాం కళ్యాణ్,రాగుల సంతోష్ రెడ్డి చందనం అనిల్ నిజామాబాద్ నర్సయ్య, వీరమ్మ గారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు
Advertisement

Latest Rajanna Sircilla News