టెస్టులు చేయకపోతే ఎలా , ప్రభుత్వం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం !

తెలంగాణరాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, అలాగే సంబంధిత పరిస్థితులపై హైకోర్టు ఈరోజు విచారణ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Ts Corona , Covid19, Ts Highcourt, Cm Kcr , Kcr-TeluguStop.com

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపుతున్నారని ఫైర్ అయింది.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారుల తీరు పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Ts Corona , Covid19, Ts Highcourt, Cm Kcr , Kcr-టెస్టులు చేయకపోతే ఎలా , ప్రభుత్వం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే, ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్టేజ్ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందన్న హైకోర్టు, WHO నిబంధనల ప్రకారం వెయ్యి మందికి 3 బెడ్లు ఉండాలి కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని వెల్లడించింది.

ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన వెద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తగ్గిందని కోర్టుకు తెలిపారు.ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ… టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎన్నున్నాయో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది.వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదని చెప్పింది.

ఇతర రాష్ట్రాలలో కేసులు, మరణాలు, టెస్టులు ఏవిధంగా ఉన్నాయి మన రాష్ట్రం లో ఈవిధంగా ఉన్నాయి అనే అంశాలపై గ్రాఫ్ ను తయారు చేయాలని హైకోర్టు తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube