ఎన్నారైలు వారి ఆరోగ్య బీమా ప్రీమియంలపై గణనీయమైన మొత్తంలో డబ్బు వెచ్చిస్తుంటారు.ఆరోగ్య బీమా ప్రీమియంలపై ( health insurance premiums )జీఎస్టీ రేటు 18% ఉంది ఇది కూడా వారికి అదనపు భారంగా మారుతుంది.
అయితే ఎన్నారైలు అర్హత ఉన్నట్లయితే జీఎస్టీ మొత్తాన్ని వాపసు పొందవచ్చు.తమకు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా కోసం చెల్లిస్తున్న ఎన్నారైలకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.ఉదాహరణకు, ఒక ఎన్నారై వార్షిక ప్రీమియం రూ.100,000 చెల్లిస్తున్నట్లయితే, వారు రూ.18,000 జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేయవచ్చు.
ఎన్నారైలు ఎన్‌ఆర్‌ఈ ఖాతా నుంచి ఏటా ప్రీమియం చెల్లిస్తే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.బీమా కంపెనీ ప్రకారం, బీమా చేసుకున్న సభ్యులు ఎన్నారైలు లేదా భారతదేశ నివాసితులు కావచ్చు.జీఎస్టీ రీఫండ్ కోసం దరఖాస్తు చేయడానికి పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్, పన్ను రెసిడెన్సీ సర్టిఫికేట్ ( TRC ), నేషనల్ అడ్రస్ ప్రూఫ్ అందించాలి.
అలానే ఒక రీసెంట్ ఫోటో, చెల్లించిన ప్రీమియంతో NRE అకౌంట్ బ్యాంక్ స్టేట్‌మెంట్ అందించాలి.
రీఫండ్ పొందడానికి ఎంత సమయం పడుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది.జీఎస్టీ రీఫండ్ పాలసీ జారీ చేసిన 15 రోజులలోపు ప్రాసెస్ చేస్తారు.భవిష్యత్తులో భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్న ఎన్నారైలు ఇప్పుడే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి, ఎందుకంటే పెద్ద వయసులో సరసమైన ప్రీమియంలతో మంచి పాలసీని పొందడం కష్టం.