సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చి సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న సినిమా పుష్ప.పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మంచి సక్సెస్ అందుకుంది.
అన్ని రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడిన చిత్తూరు యాస అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాకు ఆయన మాటలే ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.అయితే బన్నీకి ఆ యాస నేర్పించింది ఓ కుర్రాడు.
ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఈస్ట్ గోదావరిలోనే మారేడుపల్లి ఫారెస్టులో జరిగింది.ఈ నేపథ్యంలో సినిమాలోని అన్ని క్యారెక్టర్లకు చిత్తూరు యాస పెట్టాడు సుకుమార్.నటులందరికీ చిత్తూరు యాస నేర్పించాడు.నాయుడు పేట మండలం పూడేరుకు చెందిన చరణ్ అనే కుర్రాడు బన్నీకి చిత్తూరు యాస నేర్పించాడు.గంగాధరం, వాణి దంపతుల కుమారుడు చరణ్.చరణ్ తండ్రి కూలి కాగా, తల్లి స్కూల్లో మధ్యాహ్న భోజనం చేస్తుంది.
చరణ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు.పెద్దమ్మ కుటుంబం చిత్తూరులో ఉండటంతో అక్కడే ఉన్నాడు.
దీంతో తనకు చిత్తూరు జిల్లా యాసపై మంచి పట్టు ఏర్పడింది.అదే తనకు ప్రస్తుతం ప్లస్ పాయింట్ గా మారింది.
నటనపై మక్కువ ఉన్న చరణ్.ఓ ప్రైవేటు సంస్థలో పనిచేశాడు.సినిమాల్లో నటించేందుకు కూడా ట్రై చేశాడు.దాంతో పుష్ప సినిమాకు ఎంపిక అయ్యాడు.ఈ నేపథ్యంలో తన చిత్తూరు యాస సుకుమార్ కు బాగా నచ్చింది.సినిమా మొత్తం అదే యాస పెట్టాడు.
బన్నీకి తనతో ఆ యాస నేర్పించాడు.ఈ సినిమా మూలంగా తనకు ఎంతో మేలు జరిగినట్లు చెప్పాడు చరణ్.
అంతేకాదు.తనకు ఓ కొత్త లైఫ్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.