నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో .చదల వాడ తిరుపతి రావు ఏ నిమిషం లో బిచ్చగాడు సినిమా హక్కులు కొన్నారో కానీ ఈ సినిమా విడుదల అయ్యి నెలరోజులు దాటినా కూడా అద్భుతమైన రెవెన్యూ తో సాగుతోంది ఈ చిత్రం.
మొదట నుంచీ ప్రమోషన్ విషయం లో ఆసక్తి చూపించని డిస్ట్రిబ్యూటర్ తరవాత మౌత్ టాక్ బాగా రావడం తో ప్రమోషన్ లు కూడా పెంచేశారు.ఈ సినిమా ఇప్పుడు 6వ వారంలో సైతం అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఇప్పటి వరకు 16కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ట్రెడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరిచింది.జులై 1కు యాభై రోజులను కంప్లీట్ చెసుకొనున్న బిచ్చగాడు 20కోట్ల క్లబ్ లొకి చెరనుందని టాక్.
‘’మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది.నిర్మాత చేసిన ప్రమోషన్స్ కూడా కలెక్షన్స్ ను ప్రభావితం చేశాయి .
అన్నీ ఏరియాస్ లో ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుంది.విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి.
ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.!
.