చిన్న కారులో 27 మంది.. ఎలా కూర్చున్నారబ్బా..!

సాధారణంగా ఒక చిన్న కారులో మహా అయితే ఐదుగురు పడతారు.ఇంకా కొంచెం ఇరుకుగా కూర్చుంటే ఆరుగురు.

 How Are 27 People Sitting In A Small Car , Small Car, 27 Members, Viral Latest,-TeluguStop.com

కానీ ఈ కారులో మాత్రం ఏకంగా 27 మంది ఎక్కేశారు.ఏంటీ షాక్ అవుతున్నారా.

ఇది నిజమే.ఒక చిన్న కారులో 27 మంది కూర్చున్నారు.

బీఎండబ్ల్యూ మినీ కూపర్ లో 27 మంది కూర్చుని వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంస్థ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది.‘రెగ్యులర్ సైజు మినీ కూపర్ లో ఎంత మంది పడతారు?’ అంటూ రాసుకొచ్చింది.

ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇంత చిన్న కారులో 27 మంది ఎలా పట్టారబ్బా అంటూ షాక్ అవుతున్నారు.అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.2014 నాటిది.ఎనిమిదేళ్ల క్రితం ఈ వీడియోను తీశారు.అయితే సెప్టెంబర్ 6న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.

ఈ రికార్డు క్రియేట్ చేయడం కోసం సిబ్బంది వివిధ టెక్నిక్స్ వాడింది.కారులో ఎక్కువ మంది పట్టే విధంగా సీట్లను సర్దుబాటు చేశారు.

ఆ తర్వాత కారులో ఒకరిపై ఒకరు ఎక్కారు.స్వీరింగ్ కు, ముందు అద్దానికి మధ్య కూడా ఒకరు పడుకున్నారు.

డిక్కీలో నలుగురు ఎక్కారు.అలా మొత్తంగా ఆ మినీ కూపర్ లో 27 మందిని ఎక్కించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.3 నిమిషాల నిడివి గల క్లిప్ లో ఒకరి తర్వాత ఒకరు ఈ మినీ కూపర్ లో కూర్చోవడం ఈ వీడియోలో చూడొచ్చు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోస్ట్ ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.చిన్న కారులో ఇంత మంది ఎలా కూర్చున్నారబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు.దీనిపై ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు.‘బాగానే ఉంది.కానీ ఎవరైనా పిత్తితే?’, ‘ఒక కారులో ఇంత మంది కూర్చోవడం చట్టపరంగా నేరం కదా’, ‘ఇదేం రికార్డు.అసలు ఇది అవసరమా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా.ఇక ఆలస్యం ఎందుకు మీరు ఈ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube