యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఎంత అవసరమో తెలుసా ?  

How Antioxidants Work Aid-

విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్ మొదలైన వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు.ఇవి మనలో వచ్చే గుండెపోటు, కేన్సర్, పక్షవాతం, కేటరాక్ట్, కీళ్ళనొప్పులు, అల్జీమర్ వ్యాధి వంటి అనేక రకాల వ్యాధులను అరికడతాయి.

మనలో ఒత్తిడి కలిగినప్పుడు కొన్ని కణాలను నష్టపోతాం.ఆ కణాలను భర్తీ చేయటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అవుతాయి.

How Antioxidants Work Aid--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -How Antioxidants Work Aid-

ఒకవేళ యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతె శరీరంలో మృత కణాలు ఎక్కువయ్యి శరీరంలోని కణాలపై వాటి ప్రభావాన్ని చూపుతాయి.

ఈ ప్రక్రియను ఆక్సిడేషన్ ప్రక్రియ లేదా దగ్ధ ప్రక్రియ అంటారు.ఆపిల్ తొక్క తీసి వుంచితే అది నల్లబడిపోవటం, ఇనుము తప్పు పట్టడం వంటివి ఈ ప్రక్రియ కిందకే వస్తాయి.శరీరంలో జరిగే మెటబాలిక్ ప్రాసెస్ లేదా జీవక్రియ, మొదలైనవి కూడా ఆక్సిడేషన్ గా పేర్కొనవచ్చు.

ఈ ఆక్సిడేషన్ కి కాలుష్యం,పొగ త్రాగటం,ఆల్కహాల్ త్రాగటం,వ్యాయామంలో అలసట వంటివి సహకరిస్తాయి.వీటి కారణంగా ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి.

ఈ ఫ్రీ రాడికల్స్ ని శరీరంలోని కణాలతో సమతుల్యత చేయటానికిగాను యాంటీ ఆక్సిడెంట్లు అవసరం అవుతాయి.అందువల్ల యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఆహారాలను ప్రతి రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

విటమిన్ సి పండ్లు,బ్రోకలీ,నట్స్, చేప,బ్రౌన్ రైస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.యాంటీ ఆక్సిడెంట్స్ వయస్సు కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.అలాగే యాంటీ ఏజింగ్ ప్రక్రియను కూడా ఆలస్యం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

తాజా వార్తలు

How Antioxidants Work Aid- Related....