పాలకూర మొక్కలతో ఈ మెయిల్ ఎలాగంటే..!?

మనలో పాలకూరను చాలామంది ఇష్టపడుతారు.పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి.

 How About This Mail With Spinach Plants, Spinach , Seeds, E Mail, Scientists, Sa-TeluguStop.com

అందుకే పాలకూర ఆరోగ్యానికి మంచిది అని వైద్య నిపుణులు చెబుతుంటారు.ఇక పాలకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

దీనిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.మలబద్ధకం దూరం అవుతుంది.

దీంతో బరువు తగ్గాలనుకునే వారికి బాగా హెల్ప్ చేస్తుంది.అయితే పాలకూర ఆరోగ్యానికే కాదు.

సాంకేతికంగా కూడా ఉపయోగపడుతుంది.

అయితే పాలకూరను ఉపయోగించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.

ఇక భవిష్యత్తులో భూగర్భ జలాల కాలుష్యం మొదలుకొని వాతావరణ మార్పుల ప్రభావం దాకా అనేక అంశాలపై ఈ మెయిల్స్‌ ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తల అంచనా.ప్రతి మొక్కకూ ఓ కీబోర్డు, మౌస్‌ ఉండవు కానీ.

వాటి ఆకుల్లోకి కార్బన్‌ నానోట్యూబ్స్‌ ను చేర్చి సందేశాలను అందుకునేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.ఇన్‌ ఫ్రా రెడ్‌ కిరణాలను ఈ మొక్కలపై ప్రసారం చేసినప్పుడు కార్బన్‌ నానో ట్యూబ్స్‌ వెలువరించే కాంతి స్పష్టంగా కన్పిస్తుంది.

కాంతిలో ఏదైనా తేడా వస్తే కెమెరా ద్వారా శాస్త్రవేత్తకు మెయిల్‌ అందుతుందని తెలిపారు.

Telugu Mail, Seeds, Spinach-Latest News - Telugu

ఇక ఇటీవల పుట్టుకొచ్చిన సరికొత్త విభాగమే ఈ ప్లాంట్‌ నానో బయోనిక్స్‌.మొక్కల లోపల లేదా మొక్కలతో కలసి ఎలక్ట్రానిక్‌ భాగాలను పనిచేసేలా చేయడం ఇందులోని కీలక అంశం.మొక్కలు రసాయనాలను చాలా బాగా విశ్లేషించగలవు.

కాకపోతే ఆ సమాచారం మనకు తెలియదు.ప్లాంట్‌ నానోబయోనిక్స్‌ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చనేది పరిశోధకుల అంచనా.

పాలకూరలో నానోట్యూబ్స్‌ను జొప్పించడం ద్వారా భూగర్భ జలాలు, మట్టిలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించే వీలు కలుగుతుందని తెలిపారు.

పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ మైకేల్‌ స్ట్రానో మాట్లాడుతూ.

నీటి, మట్టిలోని కాలుష్యాన్ని మాత్రమే కాకుండా.మొక్కలకు దగ్గర్లోని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

సూక్ష్మస్థాయి సెన్సర్లతోనూ ఈ పనులు చేయొచ్చు.కానీ విద్యుత్‌ అవసరం లేకుండానే ప్లాంట్‌ నానోబయోనిక్స్‌ పనిచేస్తాయి.

పైగా ఒకసారి నానో కణాలను మొక్కల్లోకి జొప్పించిన తర్వాత నిరంతరం మనకు సందేశాలు అందుతూనే ఉంటాయి.కొన్నేళ్ల కింద తాము నానో కణాల సాయంతో మొక్కలు చీకట్లో వెలిగేలా చేయగలిగామని, విద్యుత్‌ అవసరం లేకుండా దాదాపు 4 గంటల పాటు ఈ వెలుతురు పొందొచ్చని స్ట్రానో వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube