ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మారుతీరావు ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసా.? దృశ్యం సినిమా టైపు లో.!     2018-09-20   09:49:44  IST  Sainath G

ప్రణయ్ పైన పలుమార్లు హత్యాయత్నం చేసి ఇప్పుడు అంతం చేశారు. అమృత తండ్రి మారుతీ రావు కిరాయి ముఠాతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. భార్య ద్వారా ఎప్పటికి అప్పుడు కుమార్తె గురించిన సమాచారం తెలుసుకున్నాడు. ఈ హత్యలో అస్గర్ అలీ, అబ్దుల్ వారీలో కీలకంగా వ్యవహరించారు. మూడు నెలలు రెక్కీ నిర్వహించారు. హత్యలో ఏడుగురు పాల్గొన్నారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ హత్య చేశాడు. ఈ హత్యలో రాజకీయ కుట్ర లేదని మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ రంగనాథ్ తేల్చి చెప్పారు.

మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌కు త్వరగా బెయిల్ వచ్చేఅవవాశముందని పోలీసులు చెప్పడంపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. బాబాయ్ బయటికి వస్తే తనకు ప్రాణహాని ఉందని అంటోంది. ఈ నేపథ్యంలో తనపై కేసు రాకుండా మారుతి రావు పెద్ద ప్లాన్ నే వేసాడు. దృశ్యం సినిమా టైపు లోనే ప్లాన్ వేసాడు.

How a meticulous escape plan by Maruthi Rao flopped last minute-Maruthi Rao,meticulous Escape Plan,pranay Murder

హత్య జరగడానికి రెండు గంటల ముందే మారుతీరావు నల్గొండ చేరుకున్నాడు.దారిలో ఎదురు వచ్చిన పోలీసులతో అవసరం లేకపోయినా మాట్లాడాడు. అంటే హత్య సీన్‌లో తాను లేనని చెప్పడానికి తంటాలు పడి విఫలమయ్యాడు. ఒకవేళ దృశ్యం సినిమా ప్లాన్ ఫెయిలైతే ప్రణయ్ హత్య కేసు నుంచి కొందర్ని తప్పించే ప్లాన్ కూడా మారుతీరావు చేశాడు. అబ్దుల్ కరీం, మహ్మద్ బారీ, అస్గర్ అలీని కేసు నుంచి బయటపడేయాలని అనుకున్నాడు. ప్రణయ్‌ను చంపిన సుభాష్ శర్మతో పాటు లొంగిపోదామని మారుతీ రావు అనుకున్నాడు. అయితే హత్య తర్వాత నిందితుల మధ్య కమ్యూనికేషన్ ఆగిపోవడంతో మారుతీ రావు లొంగుబాటు ప్లాన్ ఫలించలేదు. పోలీసులు చెబుతున్నట్లు ప్రణయ్ హత్య కేసు ఏడుగురు నిందితుల్లో ఐదుగురే కీలక పాత్రధారులా..ఇద్దరికి బెయిల్ వచ్చేస్తుందా..కోర్టులు ఏమి తేలుస్తాయనేది వేచి చూడాలి.