పురుషాంగం ఎలా స్తంభిస్తుంది? దీని వెనుక సైన్స్ ఏమిటి?  

How A Mans Is Erected Whats The Science Behind This -

పురుషుడి అంగం ఎలాంటి సందర్భాల్లో స్తంభిస్తుందో మీకు తెలియనిది కాదు.ప్రధానంగా పురుషుడి అంగం మూడు సందర్భాల్లో స్తంభిస్తుంది.

అయితే అతడికి కామోద్రేకం కలిగినప్పుడు, లేదంటే మూత్రాన్ని ముద్రలో ఆపినప్పుడు, రెండు కాకుంటే, నిద్రలోనే తమకు తెలియకుండానే అంగం స్తంభించడం ‌.కామోద్రేకం ఎలాంటి సందర్భాల్లో కలుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయం ‌.కానీ అంగం ఎలా స్తంభిస్తుందో తెలుసా? శరీరంలో ఎలాంటి మార్పులు జరగడం వలన అంగం గట్టిపడుతుంది? ఎందుకు గట్టిపడుతుంది? కొందరికి అంగస్తంభన సమస్యలు ఉంటాయి? అలా కొందరు పురుషులకు ఎందుకు జరుగుతుంది? దీని వెనుక సైన్సు ఏమిటి?

పురుషాంగం ఎలా స్తంభిస్తుంది దీని వెనుక సైన్స్ ఏమిటి-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

పురుషుడి అంగం లో 2 చాంబర్స్ ఉంటాయి.వాటిని corpora cavernosa అని అంటారు.

ఈ రెండు చాంబర్స్ పురుషాంగం యొక్క శీర్షం నుంచి pelvis దాకా విస్తరించి ఉంటాయి.ఈ ఛాంబర్స్ లో స్పాంజిని తలపించే టిష్యులు ఉంటాయి.

వీటికి చిన్నగా, పెద్ద గా మారే గుణం ఉంటుంది.ఇవి రక్తాన్ని స్టోర్ చేసుకోగలవు.

పురుషులు కామోద్రేకంలో లేనప్పుడు, అంటే మామూలుగా పనులు చేసుకుంటున్నప్పుడు ఏ రక్తనాళాలైతే ఈ ఛాంబర్ కి రక్తాన్ని సరఫరా చేస్తాయో, అవి పూర్తిగా తెరుచుకొని ఉండవు.అందుకే పురుషాంగం కామోద్రేకం లేని సమయాల్లో నార్మల్ గా ఉంటుంది.

దాని ఆకృతి లో ఎలాంటి మార్పులూ ఉండవు.కానీ కామోద్రేకం కలిగినప్పుడు అనేక మార్పులు జరుగుతాయి.

అంగస్తంభన చర్య పురుషుడి మెదడులో మొదలవుతుంది.కనులతో ఏదైనా చూసినప్పుడు, వాసన విన్నప్పుడు, కామోద్రేకం కలిగించే విషయాన్ని విన్నప్పుడు, లేదంటే కామోద్రేకం కలిగించే తాకిడి జరిగినప్పుడు, పై విషయాలు తీవ్రతను బట్టి, వాటిలోని కామోద్రేక ఆసక్తిని బట్టి, పురుషుడి మెదడు కొన్ని హార్మోనల్ మార్పులకు, కెమికల్ రియాక్షన్స్ కి రంగం సిద్ధం చేస్తుంది.

Arteries కి సందేశాన్ని పంపి ఎక్కువ రక్తం పురుషాంగాన్ని చేరేలా చేస్తుంది.అలాగే veins పనితనాన్ని ఆపేసి కామోద్రేకం తగ్గేదాకా పురుషుడి అంగం నుంచి రక్తం రాకుండా, అంటే పురుషుడి అంగం మెత్తబడకుండా జాగ్రత్త పడుతుంది.

పురుషాంగం లోని చాంబర్ టిష్యులు పరిమాణంలో పెరగడం వలన పురుషాంగం కూడా సైజులో పెద్దగా మారి అంగం గట్టిపడుతుంది.ఇదే అంగస్తంభన వెనుక దాగున్న సైన్స్

ఈ ప్రాసెస్ లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా అంగస్తంభన సమస్యలు వస్తాయి.

అంటే పురుషుడికి బేసిక్ గా కామోద్రేకం కలగకపోవడం, అంటే శృంగారం మీద ఆసక్తి తగ్గడం, హార్మోనల్ మార్పులు, రక్త సరఫరా సమస్యలు .వీటిలో అనారోగ్యకరమైన మార్పులు వస్తే అంగం స్తంభించదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు