నిజాల‌ను క‌క్కించే లై డిటెక్టర్ ఎలా ప‌నిచేస్తుందంటే..

అబద్ధాలను గుర్తించడానికి పాలిగ్రాఫ్ పరీక్ష జరుగుతుంది.పాలిగ్రాఫ్ పరీక్షను లైడిటెక్టర్ పరీక్ష అని కూడా అంటారు.

 How A Lie Detector Works, Lie Detector, Lie Detector Working, Facts About Lie Detector, Lie Detector Facts-TeluguStop.com

దీనిని 1921లో జాన్ అగస్టస్ లార్సెన్ కనుగొన్నారు.లార్సన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో వైద్య విద్యార్థి.

నేర‌పూరిత‌ కేసుల్లో బాధిత పక్షం పాలిగ్రాఫ్ లేదా లై డిటెక్టర్ పరీక్ష కోర‌డం చూస్తుంటాం.వాస్తవానికి ఈ పరీక్ష నిజం తెలుసుకోవడానికి జరుగుతుంది.

 How A Lie Detector Works, Lie Detector, Lie Detector Working, Facts About Lie Detector, Lie Detector Facts-నిజాల‌ను క‌క్కించే లై డిటెక్టర్ ఎలా ప‌నిచేస్తుందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రిమినల్ కేసుల దర్యాప్తులో పాలీగ్రాఫ్ పరీక్ష సహాయకారిగా పరిగణించబడుతుంది.పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి శరీరంలోని కొన్ని భాగాలపై వైర్లు మరియు ట్యూబ్‌లను ఉంచుతారు.

దీని తర్వాత నిపుణులు నిందితులను ప్రశ్నిస్తుంటారు.నిందితుడు సమాధానం చెప్పినప్పుడు, రక్తపోటు, శ్వాస రేటు, పల్స్ రేటు, చేతులు మరియు కాళ్ల కదలిక మొదలైనవి యంత్రంలో నమోద‌వుతాయి.

ఈ డేటా ఆధారంగా, నిపుణులు పరీక్ష ఫలితాన్ని ఇస్తారు.పరీక్ష సమయంలో ఒక వ్యక్తి అబద్ధంచెబితే అతని రక్తపోటు, శ్వాస రేటు, పల్స్ రేటు మొదలైనవి పెరుగుతాయి.

వ్యక్తి శరీరంపై ఉంచిన వైర్లు మరియు ట్యూబ్‌లు యంత్రానికి సంకేతాలను పంపుతాయి.దీనిపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. లై డిటెక్టర్ పరీక్ష సమయంలో నిపుణులు మొదట సాధారణ ప్రశ్నలను అడుగుతారు.సమయం గడిచేకొద్దీ నిపుణులు కఠినమైన ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు.

కష్టమైన ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు నిజాలు నిగ్గుతేలుతాయి.పాలిగ్రాఫ్ పరీక్ష అంతిమ సత్యంగా పరిగణించ‌రు.

నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుండి తప్పించుకుంటారని పరిశోధన వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube