అప్పుడే పుట్టిన శిశువు త‌న త‌ల్లి స్ప‌ర్శ‌ను ఎలా గుర్తుప‌డుతుందంటే..

శిశువు పుట్టిన‌ప్ప‌టి నుంచి తన తల్లి స్పర్శను ఎలా గుర్తించ‌గ‌లుగుతుందో మీకు తెలుసా? దీనిపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు.దీనిలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 How A Human Newborn Recognize Its Mother Child Milk Food Liquid Doctors Research-TeluguStop.com

అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఈ లక్షణం బిడ్డ కడుపులో ఉన్నప్ప‌టి నుంచే అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది.కడుపులో ఉన్నప్పుడు కూడా తన తల్లి స్వరాన్ని గుర్తుప‌డుతుంది.

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఎలాంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.కడుపులో పెరుగుతున్నప్పుడు శిశువు చుట్టూ ద్రవం నిండి ఉంటుంది.

ఈ ద్రవం ద్వారానే శిశువుకు పోషకాలు చేరుతాయి.ఈ అమ్నియోటిక్ ద్రవం ఒక విధ‌మైన‌ వాసన కలిగి ఉంటుంది.

పాలిచ్చే సమయంలో తల్లికి ఈ వాసన వస్తుంది. పిల్లలు పుట్టిన వెంటనే ఏడ్చినప్పుడు తల్లి తన స్థ‌నాల‌ను శిశువుకు అందించిన వెంట‌నే వారు ఏడుపు ఆపేస్తారు.

శిశువులు త‌న త‌ల్లి రొమ్ము దగ్గర నుండి వచ్చే వాసనను గుర్తిస్తారు.ఫ‌లితంగా స్త్రీ త‌న త‌ల్లో,కాదో తెలుసుకోగ‌లుగుతార‌ట‌.

స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చేసిన పరిశోధన ప్రకారం, గర్భం దాల్చిన ఆరవ నెల నుండి, నవజాత శిశువులు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు.

దీన్ని క‌నుగొనేందుకు శాస్త్రవేత్తలు ప‌లు ప్రయోగాలు చేశారు.గర్భిణులకు సోనోగ్రఫీ చేశారు.ఈ సమయంలో గ‌ర్భిణులు త‌మ‌ కడుపుపై ​​చేయి వేసినప్పుడల్లా లోప‌లి శిశువులో కదలిక వ‌చ్చింది, మరొక‌రు ఆ గ‌ర్భిణి కడుపును తాకినప్పుడు లోప‌లున్న శిశువు కదలికను తగ్గించాడు.

సహజంగానే తల్లీబిడ్డల మధ్య అనుబంధం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది పరిశోధనతో కూడా నిర్ధార‌ణ అయ్యింది.బిడ్డ తల్లికి దగ్గరగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి ఇదే కారణ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు.

How does a newborn baby recognize Mother.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube