ఎన్నికల ముందే…రిపబ్లికన్ పార్టీకి ఊహించని దెబ్బ..!!!  

Houston mayor cancels Republican Meeting, Republican Party Meeting, Houston Mayor, Corona Effect - Telugu Corona Effect, Houston Mayor, Houston Mayor Cancels Republican Meeting, Republican Party Meeting

అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి ఉదృతం అవుతున్నాయి.ప్రభుత్వం కరోనా పై విజయం సాధిస్తున్నామని ప్రకటిస్తున్నా అవన్నీ నవంబర్ లో రానున్న ఎన్నికల కోసం చేస్తున్న ఫీట్లు అని అమెరికన్స్ కి అర్థమవుతోంది.

 Houston Mayor Cancels Republican Party Meeting

మరణాల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నా.కేసులు పెరిగిపోతున్నా సరే ఎన్నికల విషయంలో ట్రంప్ ప్రభుత్వం రాజీపడటంలేదు.

ఎన్నికలకోసం సర్వం సిద్దమయ్యింది.ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ఎన్నికల ముందే…రిపబ్లికన్ పార్టీకి ఊహించని దెబ్బ..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ మళ్ళీ సారి కూడా అధికారం లోకి రావాలని ప్రచారాలని నిర్వహిస్తోంది అందులో భాగంగానే హౌస్టన్ నగరంలో ఉన్న కన్వేషన్ సెంటర్ లో సమావేశం ఏర్పాటు చేయాలని భావించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేపట్టింది.వేలాది మందిని ఈ సమావేశానికి తీసుకువచ్చి పార్టీకి అనుకూలంగా మర్చేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసింది.

అయితే అమెరికాలో ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయదలిచిన ప్రాంతలో కరోనా ప్రభావం ఈ సమావేశం కారణంగా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన మేయర్ రిపబ్లికన్ పార్టీ సమావేశాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం రద్దు చేస్తున్నందుకు బాధ పడుతున్నాను కానీ నేను ఈ పని చేయడం వలన నా ప్రాంత ప్రజలకి మేలు చేసిన వాడిని అవుతాను.

ఏ పార్టీ అయినా సరే భవిష్యత్తులో ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇస్తాం ప్రస్తుతం అనుమతులు లేవని చెప్పేశారు.ఇదిలాఉంటే ఆ ప్రాంత గవర్నర్ చురుకుగా పార్టీ సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో మేయర్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం ట్రంప్ పార్టీ కి కోలుకోలేని దెబ్బే అంటున్నారు పరిశీలకులు.

#Corona Effect #Houston Mayor

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Houston Mayor Cancels Republican Party Meeting Related Telugu News,Photos/Pics,Images..