నిరాశ్రయుల సంక్షోభం: కారణం వెతికి పట్టుకోవాలన్న ఫెడరల్ హౌసింగ్ సెక్రటరీ

ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరాశ్రయులు.దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న వారితో పాటు పలువురు పేదలు తలదాచుకోవడానికి ఇళ్లు లేక ఫుట్‌పాత్‌లు, మైదాన ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు.

 Housingsecretary Drben Carson Comments On Homeless Crisis-TeluguStop.com

ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.ఆస్టిన్, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది.

ఈ క్రమంలో ఫెడరల్ హౌసింగ్ సెక్రటరీ డాక్టర్ బెన్ కార్సన్ మాట్లాడుతూ.ముందుగా ప్రజలు ప్రభుత్వాన్ని నిందించడం ఆపేసి సాక్ష్యం ఆధారిత విధానాన్ని అమలు చేస్తేనే సమస్యను పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరాశ్రయుల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆస్టిన్‌ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు చర్యలు ప్రారంభించారు.పెరిగిపోతున్న నిరాశ్రయుల శిబిరాలను తొలగించడంతో పాటు ఆయా ప్రాంతాలను శుభ్రపరచడం ప్రారంభించారు.కాగా.నిరాశ్రయులైన ప్రజలకు ప్రభుత్వానికి మరియు ఇతరులకు ముప్పు కలిగించనంత కాలం వీధుల్లో శిబిరాలు వేసుకునేందుకు అనుమతినిస్తూ జూలై నెలలో ఆస్టిన్ నగర కౌన్సిల్ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే కౌన్సిల్ తీసుకున్న ఆ నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

Telugu Bencarson, Dr Ben Carson, Secretarydr, Teluagu Nri Ups-

హింస చెలరేగడంతో పాటు దొంగతనాలు, డ్రగ్స్‌, విచ్చలవిడిగా బహిరంగ మలమూత్రాలు విసర్జించడంతో విధుల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.పరిస్ధితి విషమించడంతో టెక్సాస్ గవర్నర్ గ్రెట్ అబోట్.ఆస్టిన్ నగర మేయర్ స్టీవ్ అడ్లర్‌కు గత నెలలో లేఖ రాశారు.

దీనికి ఘాటుగా స్పందించారు అడ్లెర్.నగరంలో ఎలాంటి సిరంజీలు, మలమూత్రాలు పెరిగిన దాఖలాలు లేవంటూ బదులిచ్చారు.

మరోవైపు ఫెడరల్ హౌసింగ్ కార్యదర్శి కార్సన్ స్పందిస్తూ నిరాశ్రయుల పట్ల నిజమైన కరుణ చూపడం అంటే వారిని శిబిరాలు వేసుకోవడానికి అనుమతినివ్వడం కాదని.అసలు కారణం ఏంటో వెతికి పట్టుకోవాలని పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube