శివజ్యోతి కారణంగా అంతా ఎలిమినేషన్‌కు నామినేట్‌  

Housemates Are Nominated For Elimination For The Reason Of Siva Jyothi - Telugu Akkineni Nagarjuna, Ali Reza, Baba Baskar, Bigg Boss Telugu, Rahul Vitta, Siva Jyothi, Telugu Bigg Boss, Varun Sandesh, Vithika

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 క్లైమాక్స్‌కు చేరింది.మొదటి వారం మినహా ఆ తర్వాత పరమ బోరింగ్‌గా అనిపించిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మళ్లీ ఆసక్తికరంగా మారింది.

Housemates Are Nominated For Elimination For The Reason Of Siva Jyothi

చివరికి వచ్చేప్పటికి గొడవలు షురూ అవుతున్నాయి.గొడవలతో ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.ఈ వారం ఎలిమినేషన్‌ పక్రియ చాలా విభిన్నంగా సాగింది.1 నుండి 7 వరకు బోర్డులు ఉండగా చిట్టీల ద్వారా ఒక్కో నెంబర్‌ను ఇంటి సభ్యులు ఎంచుకోవాల్సి వస్తుంది.నెం.1 మాత్రం బాబా బాస్కర్‌కు రాగా, నెం.2 రాహుల్‌కు దక్కింది.

 వారిద్దరు కూడా తమ స్థానాలను త్యాగం చేశారు.బాబా తన నెం.1 ను శ్రీముఖికి ఇవ్వగా, నెం.2 రాహుల్‌ అలీకి ఇచ్చేశాడు.ఇక నెం.3 ని వరుణ్‌ తన భార్య వితికకు ఇచ్చేశాడు.వరుణ్‌ నెం.3ని వితికకు ఇవ్వడం శివ జ్యోతికి అస్సలు నచ్చలేదు.ఆ నెంబర్‌ తనకే ఇవ్వాలంటూ శివ జ్యోతి పట్టు బట్టింది.

శివజ్యోతి కారణంగా అంతా ఎలిమినేషన్‌కు నామినేట్‌-Latest News-Telugu Tollywood Photo Image

బిగ్‌బాస్‌ నెంబర్స్‌ విషయంలో చర్చించుకోవాలని చెప్పారు.కాని శివ జ్యోతి గొడవ పడి ఆ నెంబర్‌ తనకే కావాలంటూ పట్టుబట్టి కూర్చుంది.

దాంతో ఆమె తీరు పట్ల ప్రేక్షకులు అంతా అసహనం వ్యక్తం చేశారు.

 శివ జ్యోతి మరియు వితికలు నెం.3 వద్ద ఉండటంతో బిగ్‌బాస్‌ ఒకొక్కరు ఒక్కో బోర్డు వద్ద ఉండని కారణంగా అందరిని నామినేట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.ఈ వారం ఇంటి సభ్యులు అంతా కూడా నామినేట్‌ అయ్యారు.

శివ జ్యోతి కారణంగా వితిక నామినేట్‌ అయ్యింది.ఆమె అసలు స్వరూపం ఇప్పుడు బయట పడింది అంటూ శివ జ్యోతి గురించి సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

నా భర్త లేని కారణంగా నాకు అన్యాయం జరగడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ శివ జ్యోతి లేవనెత్తిన పాయింట్‌ చాలా ఫూలీష్‌గా అనిపించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Housemates Are Nominated For Elimination For The Reason Of Siva Jyothi-ali Reza,baba Baskar,bigg Boss Telugu,rahul Vitta,siva Jyothi,telugu Bigg Boss,varun Sandesh,vithika Related....