టిక్ టాక్ వద్దు అన్న భర్త కోపం తో టిక్ టాక్ చేస్తూ విషం తాగిన భార్య  

House Wife Attempt A Suicide In Tik Tok Video-house Wife,social Media,tamilanadu,tik Tok Video,టిక్ టాక్,తమిళనాడు

ఇటీవల సోషల్ మీడియా లో ఎక్కువగా ఆదరణ పొందుతున్న,అలానే విమర్శలు పొందుతున్న యాప్ టిక్ టాక్. ఈ యాప్ ని బ్యాన్ చేయాలని ఒకపక్క కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజు రోజుకు ఈ యాప్ కి ఆదరణ పెరిగిపోతూనే ఉంది. అయితే ఈ యాప్ ని వాడుకొని ఒకొక్కరూ ఒక్కొక్క లా వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

ఈ వీడియోలకు భారీ గా లైక్ లు కూడా లభ్యమౌతున్నాయి. ఈ వీడియోలు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనితో వీడియోలు చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

కొందరు సాహసం చేస్తూ వీడియో లు తీస్తుండగా,మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకొని మరీ వీడియోలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళ టిక్‌టాక్ చేస్తూ ఏకంగా విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

టిక్ టాక్ వద్దు అన్న భర్త కోపం తో టిక్ టాక్ చేస్తూ విషం తాగిన భార్య -House Wife Attempt A Suicide In Tik Tok Video

తమిళనాడులోని పెరంబూర్‌లో ఘటన ఈ చోటుచేసుకుంది. ఎప్పుడు చూసినా భార్య టిక్‌టాక్ వాడుతోందని భర్త మందలించాడన్న కారణంగా ఆ భార్య టిక్ టాక్ చేస్తూ విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.

అయితే పాపం బయటనుంచి ఇంటికి వచ్చిన భర్త ఇంట్లో అచేతనంగా పడిఉన్న భార్య ను చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ టిక్ టాక్ యాప్ ని తొలుత బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వమే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.