జబర్దస్త్ వినోదినిపై హత్యాయత్నం! తృటిలో ప్రాణాలుతో బయటపడ్డాడు  

House Owner Attack On Jabardasth Comedian Vinod-

జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన నటుడు వినోదిని అలియాస్ వినోద్.అమ్మాయి గెటప్ లో స్టేజ్ మీద సందడి చేసే ఈ నటుడుని మగాడి వేషంలో బయట చూసింది చాలా తక్కువ.గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అంటూ ఇతని మీద మీడియాలో ప్రముఖంగా వార్తలు వినిపించాయి...

House Owner Attack On Jabardasth Comedian Vinod--House Owner Attack On Jabardasth Comedian Vinod-

తరువాత అవి కాస్తా తగ్గడంతో మరల వేషాలతో ఈ నటుడు బిజీ అయ్యాడు.ఇదిలా ఉంటే తాజాగా వినోద్ తన మీద కొంత మంది వ్యక్తులు ఇంటికి పిలిచి దాడి చేసారని పోలీసులకి ఫిర్యాదు చేసారు.తనని ఎంత దారుణంగా కొట్టారో దెబ్బలు కూడా చూపించాడు.

House Owner Attack On Jabardasth Comedian Vinod--House Owner Attack On Jabardasth Comedian Vinod-

ఇప్పుడు వినోద్ మీద దాడి ఘటన మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.ఓ ఇంటి వివాదంలో వినోద్ పై దాడిచేసిన దుండగులు అతనిని తీవ్రంగా కొట్టారని తెలుస్తుంది.తీవ్రగాయాలపాలైన వినోద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనిపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.

ఇళ్ళు కొనడానికి గతంలో ఇద్దరు వ్యక్తులకు పది లక్షలు ఇచ్చానని, అయితే వారు ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో సెటిల్మెంట్ చేసుకుందామని పిలిచి హత్యాయత్నం చేసారని, గొంతు పట్టుకొని చంపే ప్రయత్నం చేసారని, తప్పించుకున్న తనని వెంబడించి ఇష్టానుసారంగా గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక వినోద్ మీద దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునే పనిలో ఇప్పుడు పోలీసులు కూడా ఉన్నారని తెలుస్తుంది.