ఈ ఎన్నారై సింగ్ భారతీయయుల కోసం 20 కోట్లు ఖర్చు చేశాడు..       2018-06-25   00:56:25  IST  Bhanu C

ప్రాణం విలువ తెలిసిన నాడు ప్రపంచంలో ఎక్కడైనా సరే మారణహోమాలు జరుగవు..ఎంతో మంది అన్యాయంగా బలై పోరు..నిత్యం జరిగే మాట విద్వేషాలు జరుగవు..ప్రపంచం శాంతివంతంగా ఉంటుంది అయితే మనిషి మనిషిలాగా ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎందుకు మన చేతివేళ్ళు కూడా ఒక లా ఉండవు మనుషులు అందరూ ఒకే లా ఎందుకు ఉంటారు..సరే అసలు విషయం ఏమిటంటే తాను పుట్టిన భారతదేశానికి చెందినా 15 మంది వ్యక్తులు ఉరికంభం ఎక్కుతున్నారనే విషయం తెలుసుకున్న ఓ పెద్దాయన..వారిని కాపాడాడు..అయన చేసిన పని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..అసలు విషయం ఏమిటో మీరు చూడండి..

దుబాయ్ లో వేరు వేరు కారణాల వలన ఒకరు హత్య కేసులో మరొకరు సారాయి ,గంజాయి అమ్మిన కేసుల్లో దాదాపు 15 భారతీయులకి ఉరి శిక్షని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది…అయితే ఈ క్రమంలోనే ఈ విషయం దుబాయ్ లో సంచలనం అయ్యింది…దాంతో ఈ విషయం తెలుసుకున్న ఓ బడా వ్యాపారవేత్త దుబాయ్ లో పేరుగాంచిన హోటల్ యజమాని అయిన ఎస్పీ సింగ్ ఒబెరాయ్ చలించిపోయాడు..

సహజంగానే సమాజం కోసం ఆలోచన చేసే సింగ్..తన భారతీయులు అనే సరికి వారిని విడిపించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు..భాదితులకి నష్టపరిహారం చెల్లిస్తే వారిని విడుదల చేయచ్చు అని తెలియడంతో భాదితుల కోరికప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించి విడిపించారు…వారిలో 14 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చేశారు…మిగలిన ఒక వ్యక్తి కూడా త్వరలో స్వదేశం చేరుకుంటాడు.అయితే ఈ సింగ్ ఇప్పటి వరకూ అలా 93 మందిని విడిపించారట..ఇందుకు గాను ఆయన చేసిన ఖర్చు 20 కోట్లు పైమాటే అంటున్నారు.. ఎంతన్నా ఈ సింగ్ మనసు ఎంతో గొప్పది అంటూ భాదితులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.