గతంలో ప్రజలు హోటల్ పేర్లు అంతగా పట్టించుకోకపోయేవారు.కేవలం మంచి ఫుడ్ వడ్డించే హోటళ్ల అడ్రస్సులు మాత్రమే గుర్తుపెట్టుకునేవారు.
అయితే తమ హోటల్ కి మంచి గుర్తింపు రావాలని అప్పట్లో హోటల్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఫుడ్ ని అందించేవారు.వంటలు వండిన తర్వాత రుచి బాగుందో లేదో పరిశీలించి మంచిగా ఉంటేనే కస్టమర్లకు వడ్డించేవారు.
కానీ కాలక్రమేణా పోటీ బాగా పెరిగిపోవడంతో హోటల్ యజమానులు నేటి ప్రజలను ఆకట్టుకునేందుకు ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్యాస్పదమైన పేర్లతో రెడీ అయిపోతున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వైఫ్, తిన్నంత భోజనం, పందెం కోడి, వచ్చి తిని పో, పొట్ట పెంచుదాం, వాట్సాప్ వంటి ఫన్నీ పేర్లతో ఎన్నో హోటల్స్ పాపులర్ అయ్యాయి.
ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకుంటే తమ హోటల్ కి వెంటనే ఎంతో కొంత ఉచిత ప్రచారం దక్కుతుందని యజమానులు ఆలోచిస్తున్నారు.తమ హోటల్ గురుంచి ప్రచారం చేసేందుకు వేలల్లో ఖర్చుపెట్టి ఫ్లెక్సీలు,బోర్డులు కట్టించడం కంటే తెలివిగా ప్రజల నోళ్ళలో బాగా నానే పదాలను హోటల్ కి పేరుగా పెడితే ఉచిత ప్రచారం కలిసొస్తుందని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు.
ఐతే తాజాగా ఒక హోటల్ కి ఏకంగా నా POTTA నా ISTAM అని పేరు పెట్టారు.దీంతో స్థానిక ప్రజలు ఈ హోటల్ నేమ్ బోర్డ్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి జోకులు పేల్చుతున్నారు.
అయితే ఇటువంటి ఫన్నీ నేమ్స్ వెంటనే వైరల్ అవుతాయి అన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం నా పొట్ట నా ఇష్టం అనే హోటల్ పేరు కూడా వైరల్ అవుతోంది.
ఇంతకీ ఈ హోటల్ ఎక్కడ ఉంది? అని నెటిజన్లు ఆరా కూడా తీస్తున్నారు.అప్పుడే ఈ హోటల్ అడ్రస్ కూడా దొరికేసింది.
కొందరు నెటిజనులు హోటల్ పేరు తో పాటు అడ్రస్ కూడా తమ పోస్టుల్లో చెబుతున్నారు.అయితే నా POTTA నా ISTAM హోటల్ రాజమండ్రి లోని దానవాయిపేట లో తాజాగా ప్రారంభించారని తెలిసింది.
కాగా, క్రియేటివ్ పేర్లు పెట్టాలన్నా, సెటైర్లు వేయాలన్నా గోదారోళ్ళ తర్వాత ఎవరైనా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.