కరోనా టైం లో కొత్త హోటల్ భారీ ఆఫర్.... యజమాని అరెస్ట్!

అసలుకే కరోనా టైం లో అందరూ హోటల్స్ మూసిపెట్టుకుంటుంటే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం కొత్తగా ఒక హోటల్ ప్రారంభించాడు.అయితే ప్రారంభించితే ప్రారంభించాడు కానీ అక్కడ ఒక భారీ ఆఫర్ ప్రకటించి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

 Hotel Owner Special Offer Of Biryani At 10 Rupees On Inaugural Day In Tamilnadu,-TeluguStop.com

దీనితో ఆ యజమాని అరెస్ట్ పాలయ్యాడు కూడా.ఇంతకీ ఆ హోటల్ యజమాని ప్రకటించిన ఆ ఆఫర్ ఏంటంటే నూతన హోటల్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రచారం లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూ.10 బిర్యానీ అని ప్రకటించారు.ఆదివారం తమిళనాడులోని అరుప్పుకొట్టై లో ఈ హోటల్ ను ప్రారంభించగా ఇలాంటి ఆఫర్ ను ప్రకటించారు.

దానితో కరోనా అన్న భయం కూడా లేకుండా జనాలు అందరూ ఒక్కసారిగా ఆ హోటల్ ముందు వచ్చి పడ్డారు.హోటల్ యజమాని ఇలా ఆఫర్ ప్రకటించాడో లేదో జనాలు ఏమాత్రం కరోనా నిబంధనలను పట్టించుకోకుండా హోటల్ ముందే భారీ గా క్యూ కట్టి నిలుచున్నారు.

దీనితో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.దానికి తోడు హోటల్ ముందు క్యూలు కట్టిన జనాల్లో కొంతమంది మాస్క్ లు కూడా ధరించకుండా ఎగబడడం తో హోటల్ పైన,హోటల్ యజమాని పైన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఆదివారం రోజున పోలీసులు హోటల్ వద్దకు వెళ్లే సరికే సగానికి పైగా బిర్యానీ ప్యాకెట్లు అమ్మినట్లు పోలీసులు చెప్తున్నారు.అయితే అక్కడ చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి యజమానిని అరెస్ట్ చేసిన తరువాత కూడా మిగిలిన బిర్యానీ ప్యాకెట్లను కూడా యాచకులు పంచినట్లు తెలుస్తుంది.
అయితే కోవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా గుంపులు గుంపులుగా నిలబడటం, దానికి తోడు మాస్క్ లు ధరించకపోవడంతో పోలీసులు ఇలా కేసులు నమోదు చేసి ఆ హోటల్ యజమానిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.రూ.10 లకే బిర్యానీ దొరుకుతుంది కదా అని జనాలు ఒక్కసారిగా ఎగబడడం తో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.ఒకపక్క ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి అని జనాల మధ్య భౌతిక దూరం ఉండాలి అంటూ ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఆఫర్ ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube