హోటల్ నిర్వహణ ముసుగులో వ్యభిచారం...  

Hotel Manager In Tamilnadu2 - Telugu Hotel Manejar News Illeagal Works, Illegal Hotel Manager Arrested In Tamilnadu, Illegal Hotel Manager News, Tamil Nadu Crime News, Tamil Nadu Latest News, Tamil Nadu News

దేశంలో వ్యభిచారం నిర్వహించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినప్పటికీ కొందరు మాత్రం కొత్త దారులు వెతుక్కుంటూ వ్యభిచారాన్ని గుట్టుగా నిర్వహిస్తూనే ఉన్నారు.అయితే తాజాగా హోటల్ నిర్వహణ పేరుతో కొందరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Hotel Manager In Tamilnadu2

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి తిరువన్నమలై ప్రాంతంలో ఓ వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు.ఇందులోనే కస్టమర్లు కావలసినటువంటి లాడ్జి మరియు భోజనం ఇతర వసతులు కూడా అందుబాటులో ఉంచాడు.

అయితే ఈ హోటల్ మేనేజర్ అయినటువంటి మరో వ్యక్తి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగా హోటల్ యజమానికి తెలియకుండా కొంత మంది యువతులను హోటల్ లో ఉంచి హోటల్ కి బస చేయడానికి వచ్చిన వారికి అమ్మాయిలను సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

హోటల్ నిర్వహణ ముసుగులో వ్యభిచారం…-Latest News-Telugu Tollywood Photo Image

ఇది గమనించిన కొందరు వ్యక్తులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంబంధిత హోటల్ పై తమ సిబ్బందితో కలిసి రైడ్లు నిర్వహించారు.అంతేకాక ఈ దాడిలో నలుగురు వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి యువతులను, ఒక విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.దీంతో హోటల్ యాజమాన్యాన్ని విచారించగా హోటల్ లో పని చేస్తున్నటువంటి మేనేజర్ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

దీంతో వెంటనే హోటల్ మేనేజర్ పై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు