వేడి నీళ్ల స్నానం కరోనాని తరిమేస్తుందా..?

కరోనా ఉదృతి పెరుగుతున్న ఈ టైం లో ఏం చేస్తే వైరస్ ను నియంత్రించవచ్చు అన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.ఈ క్రమంలో లేటెస్ట్ గా వేడి నీటితో స్నానం చేస్తే కరోనాని తరిమేయొచ్చు అన్నది వినిపిస్తుంది.

 Hot Water Bathing Not Cure Covid Virus, Hot Water Bath, Corona Virus, Covid-TeluguStop.com

అయితే దీనిపై అవునని అంటుంటే మరికొందరు మాత్రం అలాంటిది ఏమి ఉండదని అంటున్నారు.వేడి నీటితో కరోనా తగ్గించడం అనేది ఫేక్ న్యూస్ అని వైద్యులు చెబుతున్నారు.

అయితే వేడి నీళ్లు స్నానం చేయడం వల్ల కొంతమేరకు ఉపయోగకరమే అంటున్నారు.శరీరానికి తగినంత ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల పెయిన్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయని అంటున్నారు.

అంతేకాదు వేడి నీటి స్నానం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని.మెదడు కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు.

దానితో పాటుగా మంచి నిద్ర కూడా పడుతుందని అంటున్నారు.అయితే వేడి నీటిని స్నానం చేయడమే కాకుండా హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తుంది.

వేడి నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించి ఊస్తే గొంతులో ఇంఫెక్షన్ తగ్గుతుందని అంటున్నారు.అంతేకాని వేడి నీటి స్నానం వల్ల కరోనా తగ్గుతుందనే ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు వైద్య అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube