రేణు దేశాయ్ రెండో పెళ్లికి హింట్ ఇచ్చిందా అంటూ?

రేణు దేశాయ్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Renu Desai Second Marriage News Viral Social Media, Renu Dasai,pawan Kalyan,seco-TeluguStop.com

జానీ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ హీరోయిన్ ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో వరుస సినిమాలు చేసి మంచి మార్కులు కొట్టేసింది.ఇక అప్పుడే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమలో పడటం.

సహజీవనం చెయ్యడం.రాజకీయ కారణాల వల్ల రెండో పెళ్లి అవ్వడం అన్ని వరుసగా జరిగిపోయాయి.

ఇక ఆతర్వాత విడిపోవడం పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకొని రావడం సంగతి తెలిసిందే.
ఇలా రేణు దేశాయ్ జీవితంలో అనుకోకుండానే అన్ని జరిగిపోయాయి.

అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు అయ్యి ఇప్పటికి కొన్ని ఏళ్ళు పూర్తయిన ఆమె పిల్లలతో ఉంటుంది కానీ రెండో పెళ్లి చేసుకోలేదు.మూడేళ్ళ క్రితం రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు రావడం అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి రెండో పెళ్లికి రేణు దేశాయ్ హింట్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయ్.

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియోనే ఈ రెండో పెళ్లి అంటూ వచ్చిన వార్తలకు కారణం.

కారణం ఏదైనా వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయ్.ఆమె షేర్ చేసిన వీడియోలో ముసి ముసి నవ్వులు నవ్వుతు జనాలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఆ వీడియో వల్ల అనుమానాలు వచ్చాయ్.

త్వరలోనే ఈ నవ్వుల వెనుక అసలు కారణం ఏంటో చెప్తాను అంటూ ఆమె ఆ వీడియోను షేర్ చేసింది.ఇక ఆ సెల్ఫీ వీడియోలో ఆద్య కూడా చాలా సంతోషంగా కనిపించింది.

మరి ఈ నవ్వుల వెనుక ఆంతర్యం ఏంటో తెలియాలి అంటే కొద్దీ సమయం పడుతుంది.కాగా రేణు దేశాయ్ ప్రస్తుతం ఆద్య అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

12 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మరి ఈ సిరీస్ ఎంత హిట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube