పవన్ ను ప్రశ్నిస్తున్న' స్టీల్ ప్లాంట్ ' ?

ఇప్పటికిప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారమే.స్టీల్ ప్లాంట్ పీకల్లోతు అప్పుల్లో ఉండడం, నిర్వహణ భారంగా మారడం వంటి కారణాలతో ప్రైవేటీకరణ చేయడమే ఏకైక మార్గంగా కేంద్రం ఆలోచన కు వచ్చింది.

 Hot Topic On Janasena Chief Pavan Kalyan Behaviour On Steel Pant Issue, Vizag St-TeluguStop.com

దానిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అప్పట్లో ఎన్నో త్యాగాలు చేసి మరి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ససేమీరా అంటూ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు అందరూ ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఇక రాజకీయ పార్టీల సంగతి అయితే చెప్పనవసరం లేదు.సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, తమ రాజకీయాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు రంగంలోకి దిగిపోయాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాము అన్నట్టుగా అటు టీడీపీ, ఇటువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిపై ఆందోళన లు వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా, బీజేపి పైనా విమర్శలు చేసేందుకు ఈ రెండు పార్టీల నేతలు సాహసించలేకపోతున్నారు.

బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకుంటామంటూ మొదట్లో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ ఈ విషయంపై కేంద్ర బిజెపి పెద్దలను కలిశారు.

ఇక అప్పటి నుంచి పవన్ సైలెంట్ అయిపోయారు.ఏదో మొక్కుబడిగా మాత్రమే ఆ పార్టీ నేతలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందిస్తున్నారు.కానీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ.అది పవన్ వల్లే సాధ్యమని కార్మికులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

Telugu Amithsha, Ap Bjp, Jagan, Janasena, Modhi, Palla Srinivas, Pavan Kalyan, V

ఈ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతం గాజువాకలో ఉంది.అక్కడ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు పల్లా శ్రీనివాస్  దీక్ష కు దిగారు.కానీ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పోరాటం చేసి కేంద్ర నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని మొదట్లో హడావుడి చేసిన పవన్ ఈ వ్యవహారంపై స్పందించేందుకు, గట్టిగా మాట్లాడేందుకు సాహసించడం లేదు.రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, పవన్, ఆ పార్టీ నాయకులు ఘాటుగానే స్పందిస్తూ, హడావుడి చేస్తూ ఉంటాయి.

కానీ ఏపీకి కీలకమైన స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేసేందుకు కేంద్రం శరవేగంగా పావులు కదుపుతున్నా, దీనిపై సీరియస్ గా నాయకులు స్పందించకపోవడం తో పవన్ వ్యవహారం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అమరావతి కోసం హడావుడి చేసిన పవన్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపైనా స్పందించాలి అనే డిమాండ్ తెరపైకి వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube