కాలం గిర్రున తిరిగితే మన గతం ఏంటి అనేది చూసుకుంటే ఒక్కోసారి చాలా అద్బుతంగా అనిపిస్తుంది.కొంత మంది సెలబ్రేటీలని చూస్తుంటే పదేళ్ళ క్రితం ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని మాట్లాడుకోవడం ఆసక్తిగా ఉంటుంది.ఇప్పుడు అలాంటి టాపిక్ పదేళ్ళ క్రితం ఒక హాట్ మోడల్ గురించి.90లలో ఒక హాట్ సూపర్ మోడల్ గా పేరుతెచ్చుకున్న భామ శీతల్ మల్లర్.పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మోడల్ గా పని చేసింది.ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లకి ఫోటోలు అందిస్తోంది.
మోడలింగ్ కెరియర్ ని వదిలేసినా తర్వాత శీతల్ సినిమాలపై వైపు ద్రుష్టి పెట్టకుండా ఫోటోగ్రఫీని ప్రొఫెషన్ గా ఎంచుకుని ట్రైన్ అయ్యింది.ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్న తర్వాత ఈ భామ విల్ద్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఫోటోగ్రాఫర్ గా కొత్త కెరీర్ ను మొదలు పెట్టింది.
అర్కిటెక్చరల్ డైజెస్ట్.స్టార్ బక్స్ ఇండియా.
వెర్వ్ మ్యాగజైన్ లాంటి వాటికి ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసింది.ఇప్పుడు అలాంటివాటితో పాటు అర్బన్ లైఫ్ స్టైల్ పై ఫోటోలు తీస్తూ వాటికి సంబంధించిన ప్రదర్శనను కూడా తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.