బాలయ్యను ఆ భామ పట్టించుకోవడం లేదా.. కారణం ఇదేనట!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

 Hot Beauty Rejected Balayya, Nbk107, Nandamuri Balakrishna, Gopichand Malineni,-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్యకు మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ సమీపంలో షూటింగ్ చేస్తున్నారు.

ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం విదితమే.ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ ని కూడా యాడ్ చేయాలనీ చూస్తున్నారు.

ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటెం నెంబర్ ఉండనుందట.

Telugu Dimple Hayathi, Hot Balayya, Item, Nbk, Shruti Haasan-Movie

ఈ మాస్ పాటకు స్టెప్పులు వేయడానికి డింపుల్ హయతి ని అనుకుంటున్నారట.అయితే ఈమె మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదట.అసలు బాలయ్యనే ఈమె పేరును గోపీచంద్ కు సజెస్ట్ చేశారట.

అయితే ఈమె ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీగా లేదట.మంచి పాత్రలు అయితేనే చేస్తా అని ఐటెం సాంగ్స్ అయితే చేయను అని చెప్పుకొచ్చింది.

దీంతో గోపీచంద్ నిరుత్సాహ పడి వేరే హీరోయిన్ కోసం సర్చింగ్ లో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube