Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పవన్ కళ్యాణ్ అంటే పది చచ్చిపోతున్న హాట్ హీరోయిన్ -Hot Beauty Expresses Her Love For Pawan Kalyan Again

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది ఇలాంటిది కాదు. తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి సమయంలో మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ కి దాసోహం అయిపొయింది తెలుగు యువత. ఆయనకి కేవలం అబ్బాయిల ఫాలోయింగే కాదు, అమ్మాయిల ఫాలోయింగ్ కూడా దండిగా ఉంది. అందులో సెలబ్రీటిలు కూడా ఉన్నారు. ఆ సెలబ్రిటిలలో ఒకరు పూనమ్ కౌర్. తెలుగు బాగా మాట్లాడే ఆ పంజాబీ అమ్మాయి, తేజ దర్శకత్వంలో సినిమా రంగలోకి అడుగుపెట్టినా, ఎందుకో ఓ వెలుగు వెలగలేకపోయింది.

సినిమా అవకాశాలు లేని పూనం, ఓ హ్యాండ్ లూం స్టోర్ ని మొదలుపెడుతోంది. దీన్ని ఎప్పుడు ప్రారంభిద్దామా అని తెగ ఆలోచించి సెప్టెంబర్ 2వ తేదిని ఫైనల్ చేసుకుంది. సెప్టెంబర్ 2వ తేది ఎందుకు? ఆరోజు ముహూర్తం అంత బాగుందా అనుకునేరు, ఆ రోజు మన పవర్ స్టార్ పుట్టినరోజు. సెప్టెంబర్ 2 సరైన రోజు. అంతకంటే మంచి డేట్ ఉండదు. పవన్ మీద ప్రేమతో ప్రారంభిస్తాను అంటోంది పూనమ్.

ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ మీద ప్రేమను వ్యక్తం చేయడం ఇదేమి మొదటిసారి కాదు. ఆమధ్య తనకు పవన్ కళ్యాణ్ లోని నిజాయితీ అంటే ఇష్టం అని, పవన్ కళ్యాణ్ లాంటి భర్త దొరకాలి, అలాంటివాడినే చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇదంతా పవన్ మీద నిజంగానే ప్రేమతో చేస్తోందా లేక మర్చిపోయిన మీడియాకి తానూ ఇక్కడే, హైదరాబాద్ లోనే ఉన్నాను అని గుర్తుచేస్తోందా?

Continue Reading
More Posts
To Top