బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ యాంకర్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4కి రంగం సిద్ధం అయ్యింది.ఇప్పటికే షో లో కింగ్ నాగార్జునకి సంబందించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి.

 Hot Anchor Ariyana Glory Will Be Entered In Bigg Boss House, Bigg Boss 4, King N-TeluguStop.com

ముగ్గురు నాగార్జునలతో రిలీజ్ చేసిన రెండో ప్రోమోకి మంచి స్పందన వచ్చింది.ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే వారి గురించి కొద్ది రోజులగా ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఈ సారి ఇద్దరు కపుల్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని టాక్ వినిపిస్తుంది.అలాగే కొంత మంది అందాల భామలని కూడా పంపించబోతున్నారని చెప్పుకుంటున్నారు.

మై విలేజ్ షో ద్వారా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని.అలాగే డిజిటల్ ఎంటర్టైన్ మెంట్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు, టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిని ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హాట్ యాంకర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతుంది అనే మాట బలంగా వినిపిస్తుంది.జెమిని కామెడీ ఛానెల్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అరియానా గ్లోరీ ఈసారి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈమె వేసే పంచ్ లు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈమెకి బిగ్ ఆఫర్ ను తెచ్చి పెట్టాయట.ఇప్పటి వరకు జెమిని కామెడీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈమె ఇకపై బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికి కూడా దగ్గర అవ్వబోతుందని తెలుస్తుంది.

అనసూయ, రేష్మి తరహాలో గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడే అరియానా బిగ్ బాస్ లో తన అందాలతో కనువిందు చేసే అవకాశం ఉంది.ఈ మధ్య కాలంలో హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో కూడా విశేషంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ అమ్మడు క్రేజ్ బిగ్ బాస్ కి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube