బిగ్‌బాస్‌3 : నాగ్‌ సర్‌ ఇలా అయితే కష్టం, కాస్త సీరియస్‌ అవ్వాలి  

Host Nagarjuna To Be Improved His Relations With Contestants-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మొదటి వారం పూర్తి చేసుకుంది.శనివారం నాగార్జున వస్తే ఎలా చేస్తాడు, ఇంటి సభ్యుల చిల్లర గొడవలకు ఎలా రియాక్ట్‌ అవుతాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

Host Nagarjuna To Be Improved His Relations With Contestants-

కాని నాగార్జున మాత్రం చాలా కూల్‌గా వచ్చి, అంతే కూల్‌గా వెళ్లి పోయాడు.నాగార్జున ఇంటి సభ్యుల మద్య జరిగిన ఇష్యూను తీసుకు వచ్చి క్లాస్‌ పీకే అవకాశం ఉందని అంతా భావించారు.

ముఖ్యంగా మహేష్‌ విట్టా మరియు వరుణ్‌ సందేశ్‌ల మద్య జరిగిన గొడవపై సీరియస్‌ అయ్యే అవకాశం ఉందనుకున్నారు.

Host Nagarjuna To Be Improved His Relations With Contestants-

నాగార్జున మాత్రం చాలా సేఫ్‌గా ఆడాడు.అసలు నాగార్జున ఆ విషయాలను ఏమీ పట్టించుకోలేదు.అసలు నాగార్జున ఆ ఎపిసోడ్‌ చూశాడో లేదో కూడా తెలియడం లేదు.

నాగార్జున మొత్తం ఎపిసోడ్స్‌ను చూస్తున్నట్లుగా లేదు అనే అనుమానం కూడా కలుగుతుంది.నాగార్జున వంటి బిజీ వ్యక్తికి గంట పాటు బిగ్‌బాస్‌ చూసే ఓపిక సమయం ఉండక పోవచ్చు.

కాని షోకు హోస్ట్‌ చేస్తున్నాడు కనుక తప్పకుండా చూడాలి.కాని నాగార్జున మాత్రం చూస్తున్నట్లుగా లేడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

శనివారం చాలా రసవత్తరంగా సాగుతుందని భావిస్తే వచ్చి ఇంటి సభ్యులతో సరదాగా నాలుగు మాటలు మాట్లాడి తనదైన శైలిలో నవ్వేసి హిమజ మరియు పునర్ణవిని సేవ్‌ చేసి వెళ్లి పోయాడు.ఆదివారం ఎపిసోడ్‌లో అంటే నేడు కూడా అదే సోది ఉంటుందనిపిస్తుంది.

సహజంగా వీకెండ్స్‌లో వచ్చే బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌కు ఎక్కువ టీఆర్పీ వస్తుంది.కాని నాగార్జున మాత్రం చాలా లైట్‌గా కానిచ్చాడు.కాస్త సీరియస్‌ అవ్వంది కష్టం అంటూ ఈ విషయమై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇంకా షో చాలా ఉంది.ముందు ముందు అయినా నాగార్జున కాస్త సీరియస్‌ అవుతాడేమో చూడాలి.

తాజా వార్తలు

Host Nagarjuna To Be Improved His Relations With Contestants- Related....