ఈసారి బిగ్‌బాస్‌ మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎందుకో తెలుసా?  

Bigg Boss 3 Telugu Is The Most Entertainment Show-anchor Rashmi,bigg Boss 3 Telugu,hema,most Entertainment Show In Telugu,sri Reddy,swetha Reddy,varun Sandesh

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయ్యింది. నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం అయిన ఈ సీజన్‌లోని పార్టిసిపెంట్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో మస్త్‌ చర్చ జరుగుతోంది. తెలుగు బిగ్‌బాస్‌ మొదటి రెండు సీజన్‌లోని పార్టిసిపెంట్స్‌తో పోల్చితే ఈసారి సెలబ్రెటీలు చాలా ఎక్కువ. స్టార్స్‌ ఈసారి ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా ఈ సీజన్‌ మొత్తం కూడా మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకులకు ఉండబోతుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

ఈసారి బిగ్‌బాస్‌ మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎందుకో తెలుసా?-Bigg Boss 3 Telugu Is The Most Entertainment Show

ముఖ్యంగా ఈ సీజన్‌లో సెలబ్రెటీ కపుల్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇండియాలో పలు భాషల్లో బిగ్‌బాస్‌ సాగుతుంది. కాని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సెలబ్రెటీ కపుల్‌ వెళ్లలేదు. మొదటి సారి వరుణ్‌ సందేష్‌ మరియు వితిక షేరులు వెళ్లడం జరిగింది.

దాంతో వీరిద్దరు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండే అవకాశం ఉంటుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పార్టిసిపెంట్స్‌ అంతా కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నారు..

ఈసారి బుల్లి తెర మరియు వెండి తెరతో పాటు సోషల్‌ మీడియా సెన్షేషన్స్‌ను కూడా రంగంలోకి దించారు. ఈ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు అయినా సిద్దంగా ఉన్నారు.

ఒకొక్కరిది ఒక్కో రకం స్టైల్‌. అందుకే ఈ సీజన్‌ మొత్తం కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా సాగుతుందని అంటున్నారు. ఇక వివాదాలు కూడా బాగానే ఉండే అవకాశం ఉంది.

ఎందుకంటే అంతా మంచి సెలబ్రెటీలు కనుక రచ్చ మొదలయ్యే అవకాశం ఉంది.