క‌రోనా రోగుల‌తో నిండిపోతున్న ఆసుప‌త్రులు.. మరణాలు కూడా ఎక్కువే.. ఎక్కడంటే.. ?

కలలు వచ్చి పోతుంటాయి.అలాగే కరోనా కూడా కలగా వచ్చింది కానీ ఇంకా పోవడం లేదు.

 Hospitals In Mexico Are Overflowing With Corona Patients And Deaths Are Also Hig-TeluguStop.com

లోకంలో తిష్టవేసుకుని కూర్చుంది.అయితే కరోనా నుండి కొన్ని దేశాలు ఇప్పుడే ఉపశమనం పొందుతుండగా, ఈ వైరస్ అంతానికి వ్యాక్సిన్ కూడా తోడ్పాటు అందిస్తుంది.

ఇదిలా ఉండగా ఒకదేశంలో మాత్రం కరోనా విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉందట.ప్ర‌తిరోజు భారత్‌ కంటే అధికంగా క‌రోనా‌ మరణాలు ఈ దేశంలో చోటుచేసుకుంటు ఉన్నాయట.

ఆ దేశం పేరే మెక్సికో.

భారత్‌తో పోల్చి చూస్తే, మెక్సికోలో కొవిడ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం భార‌త్ కంటే అధికంగా ఉన్నాయట.

ఇకపోతే ఇప్పటి వరకు మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉండేది.కానీ ఇప్పుడు మెక్సికో, భారత్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.

క‌రోనా మరణాల విషయంలో అమెరికా మొదటి స్దానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి.ఆ త‌ర్వాత స్థానాల్లో మెక్సికో, భార‌త్ ఉన్నాయి.

Telugu America, Brazil, Covid, India, Mexico, Place-Latest News - Telugu

కాగా అధిక సంఖ్యలో జ‌నాభా ఉన్న దేశాల కంటే త‌క్కువ జ‌నాభా ఉన్న మెక్సికోలో క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేపధ్యంలో ఇక్కడ కరోనా విజృంభన సమయంలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్దుకునే చర్యలు ఏవి చేపట్టకపోవడం విడ్డూరం.దీని ఫలితంగా రాజధాని మెక్సికో నగరంలోని ఆసుపత్రులు 90 శాతానికి పైగా క‌రోనా‌ రోగులతో నిండిపోయాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube