జాగ్రత్త గురూ : కరోనా లేకున్నా ఉందని చెప్పి లక్షలు గుంజుతున్న ఆసుపత్రులు…  

hospitals fraud, fake corona report, Hyderabad, Telangana, Crime news, Hospitals fraud with corona report - Telugu Crime News, Fake Corona Report, Hospitals Fraud, Hospitals Fraud With Corona Report, Hyderabad, Telangana

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో కొందరు ప్రజలు ఈ కరోనా వైరస్ కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

 Hospitals Fraud With Fake Corona Report In Telangana

ఈ విషయాన్ని గమనించిన కొన్ని బడా ఆసుపత్రులు కరోనా వైరస్ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తులకు కరోనా వైరస్ నెగటివ్ అని తేలినా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పి దాదాపుగా లక్షల్లో డబ్బులు గుంజుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు స్థానిక నగరంలో ఉన్నటువంటి ఓ పేరు మోసిన ఆసుపత్రిలో ఇటీవలే ఓ వ్యక్తి కరోనా వైరస్ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళాడు.

జాగ్రత్త గురూ : కరోనా లేకున్నా ఉందని చెప్పి లక్షలు గుంజుతున్న ఆసుపత్రులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో ఆ వ్యక్తికి కరోనా వైరస్ నెగిటివ్ అని తేలింది.అయినప్పటికీ ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆ విషయాన్ని దాచి పెట్టి ఆ వ్యక్తి కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని నకిలీ రిపోర్టును తయారు చేసి చికిత్స అందిస్తున్నట్లు నాటకం ఆడారు.

అది గమనించిన వ్యక్తి వెంటనే ఈ విషయం గురించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకునేందుకు విచారణ చేపట్టారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకీ వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దీంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఎలాంటి లక్షణాలు లేని వారికికరోనా వైరస్ ఎలా సోకుతుందని అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరోపక్క కరోనా వైరస్ చికిత్స ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం వల్ల కొన్ని బడా ఆసుపత్రులు ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి కరోనా వైరస్ లేకున్నప్పటికీ వారికి చికిత్స అందిస్తున్నట్లు బిల్లులు సమర్పిస్తూ  లక్షల రూపాయల బిల్లును ప్రభుత్వం నుంచి వసూలు చేస్తున్నారని వాదన వినిపిస్తోంది.అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో రోజు రోజుకి కేసులు నమోదు అవుతున్నాయనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి 

#Hyderabad #Telangana #Hospitals Fraud #HospitalsFraud

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hospitals Fraud With Fake Corona Report In Telangana Related Telugu News,Photos/Pics,Images..