బాబోయ్.. బిల్లు కట్టలేదని ఆ పేషెంట్ ని ఆస్పత్రి సిబ్బంది ఏం చేసిందంటే?  

hospital mangement murder patient for thousand rupees bill,hospital mangement,murder,patient,ultra sound scanning,thousand rupees bill - Telugu Hospital Mangement, Hospital Mangement Murder Patient For Thousand Rupees Bill, Murder, Patient, Thousand Rupees Bill, Ultra Sound Scanning

కరోనా సమయంలో ఆదుకోవాల్సిన వైద్య సిబ్బందే దారుణానికి పాల్పడింది.కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయిల ఆస్పత్రి బిల్లు కట్టలేదని రోగిని దారుణంగా కొట్టి చంపారు.

 Hospital Mangement Murder Patient Thousand Rupees Bill

ఇంకా ఈ ఘటన మొత్తం సీసీటీవిలో రికార్డు అయ్యింది.ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు.దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు.అయితే ఆస్పత్రికి తనతో పాటు బంధువును తీసుకెళ్లాడు.

బాబోయ్.. బిల్లు కట్టలేదని ఆ పేషెంట్ ని ఆస్పత్రి సిబ్బంది ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా రోగితోపాటు వెళ్లిన బంధువు అక్కడ ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా అల్ట్రా స్కానింగ్ తీసిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తం అన్నారు.

అయితే అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయకముందే మందుల కోసం రూ.5000 బిల్లు వేశారు.ఇంకా దానికి వాళ్ళు చెల్లించారు.

అయితే ఒకరోజు ఆస్పత్రిలో ఉంటే 4 వేల రూపాయిల నుండి 5 వేల రూపాయిల వరకు అవుతుందని చెప్పారు.దీంతో వారు డబ్బు కట్టలేం అని డిశ్చార్జ్ చెయ్యమని చెప్పారు.

ఇంకా వారికీ కట్టాల్సిన రూ.5000 కట్టి రోగి సుల్తాన్ ఖాన్‌ను తీసుకుని బయటకు వచ్చేశారు.ఇంకా ఇంతలోనే అక్కడికి వచ్చిన ఆస్పత్రి సిబ్బంది 4 వేలరూపాయిలు కట్టాలని గొడవపడ్డారు.దీంతో 5 వేలు ఇచ్చేశామని భాదితుడి బంధువు చమన్ స్పష్టం చేశాడు.అయితే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవపడ్డారు.ఇంకా కొట్టుకునే స్థాయికి వచ్చారు.

దీంతో రోగి సుల్తాన్ మీద, అతడి బంధువు చమన్ మీద దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.ఇంకా ఈ దాడిలో సుల్తాన్ ఖాన్ చనిపోయాడు.

#Murder #Patient

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hospital Mangement Murder Patient Thousand Rupees Bill Related Telugu News,Photos/Pics,Images..