నీచాతి నీచమైన డాక్టర్లు : ఇలాంటి వారి వల్లే దేవుళ్లుగా పూజింపబడాల్సిన డాక్టర్లు తన్నులు తింటున్నారు  

Hospital Left Cloth In Womans Stomach During Operation-

దేవుడు జన్మనిస్తే డాక్టర్‌ పునర్‌జన్మనిస్తాడు.అందుకే డాక్టర్‌ కూడా దేవుడే అనేది జనాలు అనే మాట.కాని ఆ డాక్టర్లు మాత్రం రోజులు మారుతున్నా కొద్ది దారుణంగా తయారు అవుతున్నారు...

Hospital Left Cloth In Womans Stomach During Operation--Hospital Left Cloth In Womans Stomach During Operation-

ఒకప్పుడు డాక్టర్‌లు పైన చెప్పుకున్నట్లుగా దేవుడి మాదిరిగానే ప్రవర్తించేవారు.కాని ఇప్పుడు దేవుడు ప్రాణం ఇస్తే డాక్టర్లు తీస్తున్నారనే విధంగా పరిస్థితి మారిపోయింది.ఇది అందరు డాక్టర్ల గురించి అయితే అస్సలు కాదు.

లక్షలు కోట్లాది మంది డాక్టర్లు ఉంటే వారిలో ఒకటి అర శాతం మంది మాత్రమే ఇలా ఉంటారు.మిగిలిన వారు తమ తిట్లను పట్టించుకోనక్కర్లేదని కోరుతున్నాను.

Hospital Left Cloth In Womans Stomach During Operation--Hospital Left Cloth In Womans Stomach During Operation-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు రాష్ట్రంకు చెందిన ఓసూరుకు కవిత అనే మహిళ కడుపు నొప్పితో ఒక హాస్పిటల్‌కు వెళ్లింది.అక్కడ డాక్టర్‌ స్కానింగ్‌ చేయించుకోమని రాయడంతో స్కానింగ్‌ సెంటర్‌ వద్దకు వెళ్లడం జరిగింది.

స్కానింగ్‌ సెంటర్‌లో కవితకు స్కానింగ్‌ చేసిన డాక్టర్‌ నోరెళ్లబెట్టాడు.తాను చూస్తున్నది నిజమేనా కాదా అనే అనుమానం వచ్చింది.పక్కనే ఉన్న కాంపౌండర్‌ను నాకే ఇలా కనిపిస్తుందా నీకు కూడా కనిపిస్తుందా అంటూ అడిగాడు...

కంపౌండర్‌ కూడా అదే విషయం చెప్పడంతో మరింత ఆశ్చర్య పోయాడు.ఇంతకు ఆ స్కానింగ్‌లో వారికి కనిపిస్తున్నది ఏంటో తెలుసా మౌత్‌ గ్లౌస్‌.అదేనండి డాక్టర్లు ఆపరేషన్లు చేసే సమయంలో ముకానికి మాస్క్‌ వేసుకుంటారు కదా అది.

కవిత కడుపులోకి అది ఎలా వెళ్లిందా అని కదా మీ డౌట్‌.సీన్‌ ఒకసారి మూడు నెలల క్రితంకు కట్‌ చేస్తే అప్పుడు ఓసూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో కవితకు ఆపరేషన్‌ జరిగింది.

పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్న సమయంలో డాక్టర్లు కడుపులో మాస్క్‌ పెట్టేసి కుట్లు వేశారు.ఇన్నాళ్ల నుండి మెల్లగా ఇబ్బంది పెట్టిన ఆ మాస్క్‌ ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది.దాంతో స్కానింగ్‌కు వెళ్తే పరిస్థితి ఇది.

విషయం తెలిసిన కవిత బంధువులు ప్రభుత్వ హాస్పిటల్‌ డాక్టర్‌లపై దాడికి దిగేందుకు ప్రయత్నించారు.అయితే వారు పారి పోయారు.

డాక్టర్లను దేవుళ్లు అంటూ పూజిస్తున్న వారు ఇలాంటి సంఘటనలు తెలిస్తే అసలు హాస్పిటల్‌కు వెళ్లాలంటే భయపడరా చెప్పండి.ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతాయి.

ప్రభుత్వ డాక్టర్లకు మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ నేను ప్రశ్నిస్తున్నా.ఇలా నీచంగా ప్రవర్తించే వీళ్లను డాక్టర్లు అనాలా అంటూ జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు...

!