10 రోజుల్లోనే నిర్మాణం.. చైనా దెబ్బకు నోరెళ్లబెడుతున్న జనం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే చికిత్స ఏమాత్రం వేగంగా ఉంటుందో అక్కడికి వెళ్లివచ్చిన వారిని అడిగితే ఇట్టే చెప్పేస్తారు.ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై ఎప్పుడు ఏదో ఒక విషయం మనం నిత్యం చూస్తుంటాం.

 Hospital Built In 10 Days In China-TeluguStop.com

అయితే ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే అది ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో అని అనుకుంటారు అందరూ.కానీ చైనాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ఎన్ని రోజుల్లో జరిగిందో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది.దీని బారిన పడ్డ వారికి చికిత్స అందించేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుక చైనా ప్రభుత్వం 1000 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు పూనుకుంది.అయితే ఈ నిర్మాణానికి వారు తీసుకునే సమయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ప్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది అక్కడి ప్రభుత్వం.

దీని కోసం వందలాది జేసీబీలతో పునాది పనులు ప్రారంభించారు నిపుణులు.ఈ ఆసుపత్రి నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించడంతో అధికారులు ఆ దిశగా నిర్మాణ చర్యలు చేపట్టారు.

ఈ ఆసుపత్రి నిర్మాణంతో అక్కడి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.ఇంత పెద్ద ఆసుపత్రిని అతి తక్కువ సమయంలో నిర్మించడం విశేషమనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube