ఆందోళన కలిగిస్తున్న కొత్త రకం వైరస్,గుర్రాలకు సోకి

వందేళ్ల తరువాత ఇలాంటి తీవ్ర స్థాయిలో వైరస్ చెలరేగింది అని,అందుకే దీని తీవ్రత ఎక్కువగా ఉంది అంటూ కొందరు నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.

 A Deadly Virus From Africa Is Killing Horses In Thailand, Coronavirus, African-TeluguStop.com

అయితే కరోనా తో అల్లాడుతుండగానే ఆ మధ్య ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే ఒక వైరస్ అస్సాం,అరుణాచల్ ప్రదేశ్ లలో వ్యాపించి వేల సంఖ్యలో పందులు మృత్యువాత పడిన విషయం విదితమే.అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ కొత్త వైరస్ వల్ల గుర్రాలు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది.థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ఒక గుర్రాలశాలలో ఈ వైరస్ సోకి ఇప్పటికే 18 గుర్రాలు మృతి చెందినట్లు సమాచారం.

ఆఫ్రికా నుంచే ఈ వైరస్ లక్షణాలు వెలుగుచూడగా వందల సంఖ్యలో గుర్రాలు చనిపోతుండడం గమనార్హం.

అసలు ఈ వైరస్ ఏంటి.? గబ్బిలాల నుంచి సోకిందా.? మనుషులకు కూడా సోకుతుందా.? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.చైనాకు కొన్ని జీబ్రాలను తీసుకెళ్ళేటప్పుడు.

వాటి నుంచి ఈ వైరస్ గుర్రాలకు సోకినట్లు వారు కనుగొన్నారు.ఫిబ్రవరి చివరిలోనే ఈ వైరస్ బ్యాంకాక్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యాప్తి చెందగా సుమారు 500పైగా గుర్రాలు దీని వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది.

మార్చిలో ఇంగ్లాండ్‌లో చనిపోయిన గుర్రాల రక్త నమూనాలను పరిశీలించగా.ఇది ఆఫ్రికన్ వైరస్‌గా తేలింది.

అయితే ఇది మనుషులకు హాని కలిగించే వైరస్ కాదని.ఆఫ్రికాలోని జీబ్రాస్‌తో సహా ఈక్విన్స్‌లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఈ వ్యాధి మిడ్జెస్ అనే దోమ లాంటి కీటకాన్ని కొరకడం వల్ల వ్యాపించిందని తేల్చారు.ఇప్పటికే ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వైరస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యాప్తి చెందటంతో వేల పందులు మృతి చెందగా, అది కేవలం జంతువులకు మాత్రమే వచ్చే వైరస్ అని వెల్లడి కావడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు ఈ తాజా వైరస్ కూడా మనుషులలో సంక్రమించదు అని తేలడం మరింత ఊరట కలిగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube