విమానమెక్కిన గుర్రం... చిరాకుపడ్డ ప్రయాణికులు

విమాన ప్రయాణ సమయాలలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.కొందరు ఆకతాయిగా ప్రవర్తూ ఉంటారు.

 Horse Plane-TeluguStop.com

మరికొందరు పెంపుడు జంతువులని తమతో పాటు తీసుకొని వస్తారు.నిజానికి విమానాలలో ప్రయాణం చేసేవారు ఎక్కువగా స్టైల్, శుభ్రతని కోరుకుంటారు.

అలాంటి వారికి ఏదైనా నచ్చనిది కనిపించిన చాలా తీవ్రంగా స్పందిస్తారు.తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.

అమెరికాలోని ఓ విమానంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది.విమానంలోని ఓ సీట్లో కుక్కపిల్ల సైజులో ఉండే ఓ మీనియేచర్ గుర్రం కూర్చొని ఉంది.

ఇక ఆ చిన్న గుర్రానికి ఓ బ్లూకలర్ మాస్క్ కూడా వేశారు.దాన్ని చూసిన కొందరు ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఒక ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా అసహనం వ్యక్తం చేసారు.కొంత మంది మూగజీవాల ప్రేమికులు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆ మూగజీవి మొహాన్ని ముసుగులో బంధించడం హింసించడంతో సమానమని అన్నారు.మరికొందరేమో అసలు ఆ గుర్రాన్ని విమానంలోకి తీసుకొచ్చిన వ్యక్తికి బుద్ధుందా అంటూ మండిపడ్డారు.

అయితే అది మామూలు గుర్రం కాదని, గుడ్డివాళ్లకు సాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన గుర్రమని ఆ పోస్టులో వివరణ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube