వైరల్ వీడియో: గుర్రం తన మొఖాన్ని అద్దంలో చూసుకుంటూ..?!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.నెటిజన్లు కూడా జంతువులకు సంబంధించిన వీడియోలను బాగా లైక్ చేస్తున్నారు.

 Horse Looking At His Face In The Mirror Viral Latest, News Viral, Video Viral, S-TeluguStop.com

జంతువుల మధ్య పోరాట దృశ్యాలు, ఫన్నీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలను సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము.

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో వీక్షకులు వీక్షించారు.

చాలామంది అయితే ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూసి తెగ నవ్వుకున్నారు.అంతలా నవ్వడానికి అసలు ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.? ఈ గుర్రం చేసిన పని గురించి తెలిస్తే మీరు కూడా పగలబడి మరి నవ్వుకుంటారు.ఇంతకీ ఈ గుర్రం చేసిన పని ఏంటో తెలుసుకుందామా.

ఒక గుర్రం అద్దంలో తనను తాను చూసుకుని చేసిన పని ఎంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యి రకరకాల హావభావాలు ప్రదర్శించింది.గుర్రం చేసిన ఈ పని నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.

సాధారణంగా మనం చిన్నపిల్లలకు మొదటిసారి అద్దం ఇచ్చి చూడమన్నప్పుడు వారు అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకుని ఆశ్చర్యపోతారు.అచ్చం నాలాగానే ఉంది ఎవరని షాక్ అవుతారు.అ పిల్లలు ముఖంలో ఎలాంటి కదలికలు ప్రదర్శిస్తే అద్దంలో ప్రతిబింబం కూడా అచ్చం అలానే చేయడం చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం మనం చాలా సార్లు చూసి ఉంటాము.

సరిగ్గా ఒక గుర్రం కూడా అలానే చేసింది.మొదటిసారిగా ఈ గుర్రం కూడా తనను తాను అద్దంలో చూసుకుంది.చుసిన వెంటనే అద్దంలో అచ్చం తనలాగానే ఉన్న మరొక గుర్రాన్ని చూసుకుని వేరే గుర్రం అని భ్రమ పడింది.

కొద్దిసేపు అలానే అద్దం వైపు చూసి తరువాత తల అటు ఇటు తిప్పుతూ రకరకాల విన్యాసాలు చేసింది.తన కళ్లను అద్దం దగ్గరకు తీసుకుని వచ్చి అద్దం దగ్గర ఉండి చెక్‌ చేయడం మనం వీడియోలో చూడవచ్చు.

అద్దంలో కనిపించేది తానే అని గుర్తుపట్టలేక వేరే గుర్రం ఎమన్నా వచ్చిందేమో అనే భ్రమలో అలా అద్దం వంక పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది.ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

ఎవరికివారు ఈ వీడియో చూసి తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube