హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘పిజ్జా 3 ది మ‌మ్మీ’ .. గ్లింప్స్ విడుద‌ల‌

అశ్విన్ కాకుమాను క‌థానాయకుడిగా డెబ్యూ డైరెక్ట‌ర్ మోహ‌న్ గోవింద్ రూపొందిస్తోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ పిజ్జా 3 ది మ‌మ్మీసి.వి.కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్ష‌కులు, విమ‌ర్హ‌లు ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డంతో పాటు సెన్సేష‌న‌ల్ హిట్ మూవీగా నిలిచిన హార‌ర్ థ్రిల్ల‌ర్‌ పిజ్జా.విజ‌య్ సేతుప‌తి కెరీర్ ప్రారంభంలో ఆయ‌న‌కు న‌టుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొక‌టి.

 Horror Thriller Pizza 3 The Mummy Starring Ashwin Kakumanu As The Hero 3-TeluguStop.com

ఇప్పుడు మ‌రోసారి నిర్మాత సి.వి.కుమార్ అలాంటి హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఆ చిత్ర‌మే పిజ్జా 3 .డైరీ ఫేమ్ ప‌విత్రా మారిముత్తు హీరోయిన్‌గా న‌టించింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర యూనిట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా స్టార్ట్ చేసింది.

 Horror Thriller Pizza 3 The Mummy Starring Ashwin Kakumanu As The Hero 3-హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘పిజ్జా 3 ది మ‌మ్మీ’ .. గ్లింప్స్ విడుద‌ల‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్లింప్స్‌లో ప్ర‌తి సీన్, దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే హార‌ర్ థ్రిల్ల‌ర్ ఎలా ఉండాల‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు భావిస్తాడో దాన్ని మించేలా ఉంది.గ్లింప్స్ చూసిన త‌ర్వాత ఈ సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.గౌర‌వ్ నారాయ‌ణ‌న్‌, అభిషేక్ శంక‌ర్‌, కాళి వెంక‌ట్‌, అనుప‌మ కుమార్‌, ర‌వీనా దాహ‌, కురైసి, యోగి, సుభిక్ష ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.పిజ్జా2కు సీక్వెల్‌గా పిజ్జా3ని ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు.అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌భు రాఘ‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

నటీనటులు:

అశ్విన్ కాక‌మాను, ప‌విత్రా మారిముత్తు, గౌర‌వ్ నారాయ‌ణ‌న్‌, అభిషేక్ శంక‌ర్‌, కాళి వెంక‌ట్‌, అనుప‌మ కుమార్‌, ర‌వీనా దాహ‌, కురైసి, యోగి, సుభిక్ష‌

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న్ గోవింద్‌ నిర్మాత‌: సి.వి.కుమార్‌ సంగీతం: అశ్విన్ హేమంత్‌ సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌భు రాఘ‌వ్ ఆర్ట్‌: ఎస్‌.కె ఎడిట‌ర్‌: ఇగ్నానిషియ‌స్ అశ్విన్‌ స్టంట్స్‌: ర‌గ్గ‌ర్ రామ్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీచ‌క్ర‌, అరుణ్ ప్ర‌జీత్‌ మేనేజ‌ర్స్‌: జె.మ‌ణి, ఆనంద్‌ ఆడియోగ్ర‌ఫీ: క‌వియం స్టూడియోస్‌ సౌండ్ డిజైన్‌: గుణ‌ సౌండ్ మిక్స్‌: న‌వీన్ స్టీఫెన్‌ కాస్ట్యూమ్‌: న‌వ‌దేవి రాజుకుమార్‌, మీనాక్షి చీఫ్ మేక‌ప్ ఆర్టిస్ట్: సురేశ్, రామ‌చంద్ర‌న్‌ డి.ఐ.: గోపు నాగ‌రాజ‌న్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌: న‌వీన్‌ స్టిల్స్‌: ఎ.గుణ శేఖ‌ర‌న్‌ పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌ డిజిట‌ల్ మార్కెటింగ్‌, క్రియేటివ్ ప్ర‌మోష‌న్స్‌-డిజిట‌ల్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌: తిరు కుమర‌న్ ఎంట‌ర్‌టైన్మెంట్‌

.

#Mummy #Mohan #Glimpses #CV Kumar #Ashwin Kakani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు