ఆగ్రా హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..!!

దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ రోడ్డు ప్రమాదాలను అరి కట్టలేని పరిస్థితి నెలకొంది.

 Horrible Road Accident On Agra Highway , Uttar Pradesh,agrah,jharkhand,kanpur, Y-TeluguStop.com

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా కాన్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.సరిగ్గా ఈ దుర్ఘటన ఎత్మాఉద్ధౌల్ ప్రాంతంలో జరిగింది.

జార్కండ్ రాష్ట్రానికి చెందిన స్కార్పియో ఒక కంటెైనర్‌ను అతివేగంతో ఢీకొంది.

దీంతో అక్కడికక్కడే 8మంది మృతి చెందారు.

నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.

సంఘటనా స్థలానికి చేరుకుని .స్థానికుల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు.చెల్లాచెదురుగా పడిపోయిన శవాలను పక్కనపెట్టి తీవ్ర గాయాలు అయిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు.జరిగిన ఘటనలో మృతుల వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు.ఇదిలా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అయిన క్షతగాత్రుల పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు.సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube