స్త్రీలలో మూడ్ స్వింగ్ అనేది చాలా కామన్ విషయమని మనందరికి తెలిసిందే.అందుకే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని అంటుంటారు.
ఇలా ఎందుకు జరుగుతుందో మినిమమ్ సైన్స్ నాలేడ్జి ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలియని వారికి చెప్పేదేంటంటే స్త్రీలలో పిరియడ్స్ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తరుచుగా జరుగుతూ ఉంటుంది.అందుకే ఎప్పుడు ఎలా మాట్లాడుతారో, ఎలా బిహేవ్ చేస్తారో ఓ అంచనాకి రావడం కష్టం.ఇంతమాత్రమే కాదు, మూడ్ స్వింగ్ వలన మహిళలు ఆలోచించే తీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే తీరు కూడా ప్రభావితం అవుతుందని ఓ ఆధ్యయనంలో పరిశోధకులు చెప్పుకొచ్చారు
పీరియడ్స్ సైకిల్ లో ఒక ఫేస్ లో ఉన్నవారు విషయాలు బాగా గుర్తుకుపెట్టుకుంటే, మరో ఫేస్ లో ఉన్నవారు బాగా లాజికల్ గా అలోచించారట.
అంటే హార్మోనల్ బ్యాలెన్స్ మారుతున్నాకొద్దీ మహిళల మెదడు భిన్నంగా స్పందించడం, పనిచేయడం జరుగుతుందన్న మాట
ఈస్ట్రోజన్, ప్రొగ్రోస్టీరోన్ హార్మోన్లు మెదడు పనితీరుపై బాగా ప్రభావం చూపుతాయని, ఎలాంటి విషయాన్ని ఎలాంటి కోణంలో అలోచించి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అప్పటికప్పుడు సూచించనంత పనిచేస్తాయని కెనెడాకు చెందిన ప్రొఫేసర్ వేయిన్ బ్రేక్ రిసర్చ్ అనంతరం తెలిపారు.