ష‌ర్మిల‌ను న‌మ్మ‌ని ఆశావ‌హులు.. త‌ల‌నొప్పిగా మారిన బీటీమ్ ప్ర‌చారం..!

అనుకోని ప‌రిణామాల మ‌ధ్య తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టింది వైఎస్ ష‌ర్మిల‌.ఎలాంటి ముంద‌స్తు ప్ర‌చారం లేకుండానే నేరుగా రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయ‌డం, ఆ వెంట‌నే పార్టీని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

 Hopefuls Believe Sharmila .. Beatim Campaign Turned Into A Headache Sharmila, Po-TeluguStop.com

ఎన్నో అంచ‌నాల‌తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి త‌న తండ్రి పేరుమీద‌నే ఓట్లు రాలుతాయ‌ని ఆమె గ‌ట్టిగా న‌మ్ముతోంది.రాజ‌కీయాల్లో త‌న తండ్రికి ఉన్న గుర్తింపుతో ఇత‌ర‌పార్టీల్లోని నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చేర్చుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అయితే ఈ క్ర‌మంలోనే ఆమెకు అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.మిగ‌తా పార్టీల్లోని అసంతృప్త నేత‌ల‌ను త‌న పార్టీలో చేర్చుకుని పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆమె ఎంత‌గానో భావిస్తున్నారు.

కానీ ఆమెవ‌కు వారి నుంచి కొన్ని సూటి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం షర్మిల పార్టీలో పట్టుమని పది మంది కూడా బ‌ల‌మైన నేత‌లు, తెలంగాణ‌లో పేరున్న సీనియర్ నాయకులు కూడా ఆమె పార్టీలో లేక‌పోవ‌డం పెద్ద దెబ్బ‌.

కాబ‌ట్టి ఎలాగైనా త‌న పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని ఆమె భావిస్తున్నారు.

Telugu Sharmila, Ts Congress, Ts Potics, Ys Sharmila, Ysr Telengana-Telugu Polit

ఇందుకోసం ఇత‌ర పార్టీల్లో అసంతృప్తుల‌వైపు గాలం వేస్తున్నారు.కానీ అది పెద్ద‌గా స‌క్సెస్ కావ‌ట్లేదు.వారంతా ఆమెను మీది తెలంగాణ‌లో ఇప్పుడున్న ఏ పార్టీకి బీ టీమో చెప్పండంటూ ప్ర‌శ్న‌లు విస‌ర‌డం ఆమెకు పెద్ద తల‌నొప్పిగా మారింది.

ఎందుకంటే ఆమె పార్టీపై మొద‌టి నుంచి టీఆర్ ఎస్ కు బీ టీం అని లేదంటే కేంద్రంలోని బీజేపీ కి బీ టీం అంటూ ప్రచారం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌లు నేత‌లు కురిపిస్తున్నారు.ఆమె త‌న పార్టీలోని నాయ‌కుల‌తో ఇత‌ర పార్టీల్లోని నేత‌ల‌కు ఫోన్లు కూడా చేయిస్తూ త‌న పార్టీలో చేరాల‌ని కోరుతున్నారు.

కానీ వారేమో ఇలా ప్ర‌శ్న‌లు వేయ‌డంతో ఆమెకు చాలా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.మ‌రి షర్మిల ఈ ప్ర‌చారంపై ఎలాంటి క్లారిటీ అయినా ప్ర‌జా వేదిక‌గా ఇవ్వాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube