సెల్ఫీ తీసుకుంటూ డ్యామ్ లో పడిపోయిన మహిళ…చివరికి..  

Doctor wife falls into Dam when taking selfie in Madhyapradesh, Madhyapradesh, Bhopal Dam, Selfie, Doctor Wife Himani Mishra - Telugu Bhopal Dam, Doctor Wife Falls Into Dam When Taking Selfie In Madhyapradesh, Doctor Wife Himani Mishra, Madhyapradesh, Selfie

సెల్ఫీ పేరు చెప్పగానే నెలల పిల్లలు సైతం రెడీ అయిపోతున్న రోజులు.ఈ స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ సెల్ఫీ ల పిచ్చిలోనే మునిగిపోతున్నారు.

TeluguStop.com - Hopal Doctor Wife Fell In Halali Dam When Taking Selfie

ఈ క్రమంలో కొందరు ప్రాణాలను సైతం పోగుట్టుకున్నప్పటికీ జనాల్లో మాత్రం మార్పులు రావడం లేదు.ఒకపక్క కరోనా టెన్షన్ లో జనాలు ఉంటే మరికొందరు మాత్రం తమ సెల్ఫీ పిచ్చితో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ భోపాల్ లో ఇలాంటి సెల్ఫీ ఘటన చోటుచేసుకుంది.సెల్ఫీ తీసుకోవాలని భావించిన ఒక మహిళ భోపాల్ లోని ఒక డ్యామ్ దగ్గరకు వెళ్ళింది.

TeluguStop.com - సెల్ఫీ తీసుకుంటూ డ్యామ్ లో పడిపోయిన మహిళ…చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఎదో సెల్ఫీ కొంచం బాగా తీసుకోవాలని భావించిందో ఏమో కానీ డ్యామ్ ఒడ్డున ఉన్న గోడ చివర కూర్చొని ఆమె సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసింది.అయితే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడం తో 10 లేదా 12 అడుగుల కిందన ప్రవహిస్తున్న డ్యామ్ నీటిలో పడిపోయింది.

వివరాల్లోకి వెళితే… భోపాల్ లోని కోలార్ లో నివసిస్తున్నారు డాక్టర్ ఉత్కర్ష మిశ్రా, ఆయన సతీమణి హిమానీ మిశ్రా.అయితే ఈ దంపతులు ఇద్దరూ కూడా భోపాల్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యామ్ చూద్దామని భావించి భార్యతో కలిసి అక్కడకి వెళ్లారు.

ఆదివారం హాలిడే కావడంతో చాలా మంది అక్కడకు వచ్చారు.ప్రకృతిని ఆస్వాదిస్తూ… ఎవరికి వాళ్లు… రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

అయితే ఉత్కర్ష మిశ్రా డాక్టర్ కావడం తో ఆయనకు ఏవో మెసేజ్ లు వస్తే వాటిని చూసుకుంటూ ఒక పక్కన నిలుచున్నారు.అయితే ఆ సమయంలో అందరూ సెల్ఫీ లు తీసుకోవడం చూసిన హిమానీ సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది.

అయితే పక్కన భర్త లేకపోయినా సెల్ఫీ ల మోజులో మునిగిపోయింది.దీనితో ఆ డ్యామ్ ఒడ్డున ఉన్న గోడ చివర కూర్చొని సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె అదుపుతప్పడం తో జారి కిందపడిపోయింది.అయితే అటుగా మొబైల్ లో మెస్సేజ్ లు చూసుకుంటున్న డాక్టర్ గారికి ఆమె అరుపులు మాత్రం వినిపించడం తో ఒక్కసారిగా తిరిగి చూసేటప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

హిమానీ డ్యామ్ లోని నీళ్ళల్లో పడిపోయి అలా అలా కొట్టుకుపోవడం జరిగిపోయింది.దీనితో వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ మొదలు పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే సోమవారం ఉదయం నాటికి కానీ ఆమె మృతదేహం లభించలేదు.సెల్ఫీ తీసుకుంటూ హిమానీ మృతి చెందడం తో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

#Bhopal Dam #DoctorWife #Madhyapradesh #DoctorWife #Selfie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hopal Doctor Wife Fell In Halali Dam When Taking Selfie Related Telugu News,Photos/Pics,Images..