ఏంటో ప్రత్యేకత : రూ. 20 వేల రూపాయల ఫోన్‌ పోయింది, దాన్ని తెచ్చిస్తే 5 లక్షల రూపాయల బహుమానం

కొన్ని వస్తువులకు విలువ కట్టలేం, అలాంటి విలువ కట్టలేని వస్తువు మన నుండి పోయినప్పుడు లేదంటే మనం దాన్ని పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది.ఉదాహరణకు ఒక పెన్నును పోగొట్టుకుంటే పర్వాలేదు మరోటి కొనుక్కోవచ్చు అనిపిస్తుంది.

 Honor Is Offering Rs 5 Lakh For Finding Lost Phone 20-TeluguStop.com

అదే పెన్ను ఒక స్నేహితుడు లేదా ప్రియురాలు లేదంటే తల్లిదండ్రులు ఇస్తే ఆ పెన్‌ పోగొట్టుకుంటే చాలా బాధ వేస్తుంది.అలాంటి పెన్ను 50 రూపాయలు పెడితే వచ్చినా కూడా ఆ పెన్ను తిరిగి దక్కించుకునేందుకు 500 రూపాయలు అయినా ఖర్చు పెట్టవచ్చు.

ఇప్పుడు హానర్‌ కంపెనీ వారు ఇదే చేస్తున్నారు.
ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ను దక్కించుకున్న బ్రాండ్‌ హానర్‌.

ఇది మంచి బ్రాండ్‌ అంటూ అంతా కూడా నమ్ముతారు.అలాంటి కంపెనీకి చెందిన రూ.20 వేల ఫోన్‌ పోయింది.ఆ కంపెనీ ప్రధాన ఉద్యోగి ఆ ఫోన్‌ను పోగొట్టాడు.ఇప్పుడు ఆ ఫోన్‌ను పట్టుకుని తెచ్చి ఇచ్చిన వారికి ఏకంగా అయిదు లక్షల రూపాయల రివార్డును కంపెనీ ప్రకటించింది.20 వేల రూపాయల ఫోన్‌కు అంతగా రివార్డు ఎందుకు ఇవ్వడం అనుకుంటున్నారా, ఆ ఫోన్‌ కొత్త మోడల్‌, ఇంకా అది మార్కెట్‌లోకి రాలేదు.

హానర్‌ నుండి త్వరలో విడుదల కాబోతున్న కొత్త మోడల్‌ ఫోన్‌ అది, దాన్ని కంపెనీలో ఒక ఉన్నత శ్రేణి అధికారి వినియోగిస్తున్నాడు.దాన్ని టెస్టింగ్‌ పర్పస్‌లో అతడు తన వద్ద ఉంచుకున్నాడు.

అయితే అది ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో రైల్లో ప్రయాణిస్తున్న సందర్బంగా పోగొట్టాడు.ఆ ఫోన్‌ పోవడంతో కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇంకా బయటకు విడుదల కాని పోవడంతో కంపెనీకి డ్యామేజీ జరిగే అవకాశం ఉందని, అందుకే వెంటనే ఆ ఫోన్‌ను తమకు అప్పగించిన వారికి 5 లక్షల రూపాయల రివార్డును ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది.అయితే ఆ మోడల్‌ను మే 21న విడుదల చేయబోతున్నారు.

అప్పటి వరకు పోయిన ఫోన్‌ను తీసుకు వచ్చిన వారికి ఆ రివార్డు ఇస్తారట.ఆ ఫోన్‌లో ఎలాంటి రహస్యాలు లేవు, ప్రత్యర్థి కంపెనీ వారికి ఆ ఫోన్‌ లభించినా పోయేది ఏమీ లేదు.

మోడల్‌ నుండి వచ్చిన మొదటి ఫోన్‌ అవ్వడం వల్ల కంపెనీ వారు కాస్త ఆసక్తి చూపుతున్నారు అంతేనట.మరి వారికి ఆ ఫోన్‌ దొరికేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube