సముద్రపు దొంగలకి చిక్కిన భారత నౌక సిబ్బంది

సముద్రపు దొంగల గురించి హాలీవుడ్ సినిమాలలో చూడటం తప్ప నిజంగా చూసిన దాఖలాలు లేవు.ఒకప్పుడు సముద్రపు దొంగలు ఉనికి ఎక్కువగా ఉండేదని, సముద్రమార్గంలో వెళ్ళే సరుకులని అడ్డగించి ఎత్తుకుపోవడం, అందులో ఉన్న సిబ్బందిని చంపేయడం, లేదంటే కిడ్నాప్ చేసి వారి డిమాండ్లు తీర్చుకోవడం చేసేవారని విన్నాం.

 Hong Kong Vessel Indians Onboard-TeluguStop.com

అలాగే కరేబియన్ దేవులలో ఇప్పటికి సముద్రపు దొంగల ఉనికి ఉంది.నౌకల ద్వారా రవాణా చేసే ఖరీదైన సరుకులని వీళ్ళు అడ్డగించి ఎత్తుకుపోతూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా హాంకాంగ్ నుంచి నైజీరియా వెళ్తున్న చమురు రవాణా నౌకపై సముద్రపు దొంగలు దాడి చేసి అందులోని 19 మంది సిబ్బందిని అపహరించుకుపోయారు.

సముద్రపు దొంగలకి చిక్కిన ఈ 19 మంది నౌక సిబ్బందిలో 18 మంది భారతీయులే అని తెలుస్తుంది.నైజీరియా తీరంలో హాంకాంగ్‌ జెండాతో వెళ్తున్న నేవ్ కాన్‌స్టలేషన్ అనే నౌకపై సముద్ర దొంగలు దాడి చేసి, నౌకను అక్కడే వదిలేసి అందులోని సిబ్బందిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినట్లు ఏఆర్‌ఎక్స్‌ మారిటైమ్‌ అనే సంస్థ పేర్కొంది.18 భారతీయ నౌక సిబ్బంది అపహరించబడిన విషయం తెలుసుకున్న నైజీరియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించారు.కిడ్నాప్ అయిన ఇండియన్ సిబ్బంది విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు.అయితే ఈ అపహరణకి గురైన వారు ఏ ప్రాంతానికి చెందివారు, వారి వివరాలు ఏంటి అనే విషయాలు తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube