ఈ దేశంలో స్మశానంలో ఆరడుగుల స్థలాన్ని కూడా కొనుక్కోవాలట..!

ఈ దేశంలో స్మశానంలో స్థలం కూడా కొనుక్కోవాల్సిందేనటఅక్కడ చనిపోయి ఆరు సంవత్సరాలు దాటితే ఆ ప్లేస్ లో వేరే వ్యక్తిని పూడ్చి పెడతారట.ఎందుకు అలా అనుకుంటున్నారా ఎందుకంటే ఆ దేశంలో ప్రజలు ఉండడానికే స్థలం చాలా తక్కువుగా ఉంటుందట.

 Hong Kong Real Estate Now More Expensive For The Dead Than The Living, Hong Kong-TeluguStop.com

అందుకే స్మశానాల్లో ఒకరిని పూడ్చి పెట్టిన ఆరేళ్లకే ఇంకొకరిని అదే స్థలంలో పూడ్చి పెడతారట.

అంత చిన్న దేశం ఎక్కడ అని అనుకుంటున్నారా అదే హాంకాంగ్ఈ దేశం చాలా చిన్న దేశం ఈ దేశాన్ని చైనా తన అధీనంలో ఉంచుకుంది.

ప్రత్యేక దేశంగా చేసేందుకు ఒప్పుకోక పోవడంతో ఇప్పటికే ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.హాంకాంగ్ ఎంత అభివృద్ధి చెందుతున్న జనాభా ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రజలు ఉండడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది.

Telugu Hong Kong, Hongkong-Latest News - Telugu

అక్కడ నివసించే ప్రజల ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి.అందుకే అక్కడ స్మశానంలో పాత శవాల్ని తీసేసి కొత్త శవాల్ని పెట్టె ఆచారం కొన్ని ఏళ్లుగా పాటిస్తూ వస్తున్నారు.ఇప్పుడు కరోనా కారణంగా ఈ దేశం స్థలం లేక అన్ని దేశాల కన్నా ఎక్కువుగా ఇబ్బంది పడుతుంది.మన దేశంలో ఇలా స్మశానంలో ఒకరిని పెట్టిన దగ్గర తొవ్వి మరొకరిని పెట్టడం ఆచారాలకు విరుద్ధం.

Telugu Hong Kong, Hongkong-Latest News - Telugu

కానీ ఈ దేశం మాత్రం జనాభా ఎక్కువ స్థలం తక్కువ.అందుకే అక్కడ స్మశానంలో స్థలాన్ని అద్దెకు ఇస్తున్నారు.ప్రతి శవానికి ఆరు సంవత్సరాలు మాత్రమే టైం ఉంటుంది.ఆ తర్వాత అదే ప్లేస్ లో మరొక శవాన్ని పూడ్చి పెడతారు.ఇప్పుడు కరోనా కారణంగా స్మశానంలో స్థలం దొరకక అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారట.అందుకే ఇక్కడ లాటరీ సిస్టం పెట్టి నంబర్ వచ్చిన వాళ్ళు మాత్రమే శవాన్ని పూడ్చి పెడుతున్నారు.

లేకపోతే శవాన్ని కాల్చి ఆ బూడిదను దాచిపెట్టి స్థలం దొరికినప్పుడు అక్కడ భద్రపరుస్తున్నారు.ఏంటో ఈ దేశంలో బతకడమే కాదు.

చావడం కూడా కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube