అమెరికన్ డాక్టర్ దంపతులకు విరహ వేదన: హనీమూన్‌ లేకుండా చేసిన కరోనా

కరోనా ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలను తన కబంద హస్తాల్లో బంధించిన కోవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం మరికొద్ది నెలల్లో ఆర్ధిక మాంద్యంలోకి జారిపోతుందని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Honeymoon,covid-19,american Doctors,  Wedding, Coronavirus-TeluguStop.com

ఇకపోతే కొత్తగా పెళ్లయిన వారికి హానీమూన్ అనేది ఓ మధుర స్వప్నం.పెళ్లయిన తర్వాత భార్యతో ఇలా గడపాలని, అలా గడపాలని ఏవేవో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు.

అలా హనీమూన్‌కు వెళ్లిన ఓ డాక్టర్ల జంట ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.

కాశీఫ్ చౌదరి, నైనా షెరీన్‌లకు మార్చి నెల చివరిలో వివాహం జరిగింది.

హనీమూన్‌కు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో అమెరికా అంతటా కరోనా విజృంభిస్తుండటంతో వారి కలలన్నీ కల్లలయ్యాయి.ఇద్దరిని విధులకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.రెండు వారాల క్రితం వారిద్దరూ న్యూజెర్సీలోని హౌథ్రోన్‌ మసీదులో ఒక ఇమామ్‌ను ఒప్పించి నిఖా జరిపించుకున్నారు.ఆ తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు న్యూయార్క్ న్యూ విండ్సర్‌లోని ఇంట్లో వేడుకలు జరుపుకున్నారు.

Telugu Coronavirus, Covid, Honeymoon-

అయితే కోవిడ్ 19 కారణంగా న్యూయార్క్‌లోని నివాసితుల పర్యవేక్షించే ఇంటర్నల్ మెడిసిన్ చీఫ్ రెసిడెంట్‌గా షెరీన్ వివిధ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ విషాద సమయంలో ఫన్నీ వీడియోలను పరస్పరం షేర్ చేసుకుంటూ వీరిద్దరూ బాధను మరచిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం న్యూయార్క్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, ఇలాంటి ఒక మహమ్మారిపై తాను పోరాడతానని అనుకోలేదని చౌదరీ వ్యాఖ్యానించాడు.37 ఏళ్ల కాసిఫ్ చౌదరీ అయోవాలోని సెడార్ రాపిడ్స్‌‌లోని మెర్సీ మెడికల్ సెంటర్‌లో కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

కరోనా కారణంగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోగులను చూస్తున్నారు.తాను షెరీన్ గురించి చాలా ఆందోళన చెందుతున్నానని.కానీ తాను ఆమెను చూసి నిజంగా గర్వపడుతున్నానని చౌదరీ ఉద్వేగంగా చెప్పారు.భార్యాభర్తలిద్దరూ ఫేస్ టైమ్ ద్వారా చాటింగ్ చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

తాను ఇలా ఉండటానికి కారణం తండ్రే అంటున్నారు చౌదరి.ఆయన తండ్రి బొలీవియాలో పేస్‌మేకర్లను అమర్చేందుకు స్వచ్ఛందంగా పనిచేశారు.

షెరీన్, చౌదరీలకు గ్వాటెమాలలో పరిచయం కలిగింది.ఇద్దరు కొద్దిరోజులు డేటింగ్ అనంతరం వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube