వివాదాస్పద సింగర్ హనీ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.పలువురు ప్రముఖులతో వివాదాలు పెట్టుకున్న ఆయన.
ప్రస్తుతం తను కట్టుకున్న భార్య మూలంగానే మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు.తాజాగా ఆయన సతీమణి షాలినీ తల్వార్ తనపై కేసు పెట్టింది.
తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నట్లు కేసు ఫైల్ చేసింది.ఆర్థికంగానూ వేధిస్తున్నట్లు కంప్లైట్ లో రాసింది.
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కేసు వేసింది.ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
అయితే ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు.గంతోలనూ పలు గొడవల్లో సెంటర్ గా ఉన్నాడు.ఇంతకీ తన కెరీర్ లో ముఖ్యమైన వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాద్షాతో గోడవ
హనీ సింగ్, బాద్షా మంచి మిత్రులు.అయితో ఓ ప్రెస్ మీట్ లో తనను చాలా తక్కువ చేసేలా కామెంట్స్ చేశాడు.దీంతో వారి ఫ్రెండ్ షిప్ కు బ్రేక్ పడింది.
ఓసారి జరిగిన ప్రెస్ మీట్ లో మ్యూజిక్ వరల్డ్ చాలా కాలం తర్వాత బాద్షా చెప్పుచేతుల్లోకి మారిందా? అని విలేకరులు ప్రశ్నించారు.రోల్స్ రాయిస్ కు నానోకు మధ్య చాలా తేడా ఉందంటూ బాద్షాను నానోతో పోల్చాడు.ఈ కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.
షారుక్ ఖాన్ తో చెంపదెబ్బ
చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ లుంగి డ్యాన్స్ పాటలో షారుఖ్ తో కలిసి హనీ సింగ్ డ్యాన్స్ చేశాడు.అయితే అతడి ప్రవర్తనను చూసి షారుఖ్ తీవ్ర అసహనానికి గురయ్యాడట.అంతేకాదు.
కోపంతో తన చెంప పగలగొట్టినట్లు వార్తలు వచ్చాయి.అయితే అవన్నీ రూమర్స్ అని హనీ సింగ్ భార్య అప్పట్లో కొట్టిపారేసింది.
మఖ్నా లిరిక్స్ వివాదం
2019లో సిద్ధార్థ్ మల్హోత్రా మర్జావాన్ సినిమాలో నటించాడు.ఇందులో మఖ్నా సాంగ్ వివాదం అయ్యింది.ఈ సాంగ్ మొదట్లో మంచి టాక్ తెచ్చుకున్నా.అందులోని లిరిక్స్ పట్ల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.పలు చోట్ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
మెయిన్ హూన్ బలాత్కారి సాంగ్
2013లో వచ్చిన మెయిన్ హూన్ బలాత్కారి పాట పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశాడు.అతడిని ఉరి తీయాలని జనాలు ఆందోళన చేశారు.అయితే చివరకు కేసు కోర్టుకు చేరింది.అక్కడ కేసు ప్రూవ్ కాలేదు.
హనీ సింగ్ విశాల్ దడ్లాని
లుంగీ డాన్స్ పాట కోసం విశాల్ దడ్లానితో కలిసి హనీ సింగ్ పని చేశాడు.అప్పుడు ఇతడి ప్రవర్తన విశాల్ కు నచ్చలేదని.అప్పటి నుంచి చాలా కాలం మాట్లాడుకోలేదనే వార్తలు వచ్చాయి.