హ‌నీ బ్యాడ్జ‌ర్ ప‌వ‌ర్ అంటే ఇదేనా.. కొండ చిలువ‌ను చీల్చి చెండాడిందిగా

మాన‌వ స‌మాజం క‌న్నా అడ‌వి చాలా భిన్నంగానే ఉంటుంది.అక్క‌డ బ‌త‌కాలంటే నిత్యం ప్రాణాల‌తో యుద్ధం చేయాల్సిందే.

 Honey Badger Fight With Python Viral Video, Honey Badger,python, Honey Badger Fi-TeluguStop.com

ఏ క్ష‌ణం ఎవ‌రి ప్రాణం పోతుందో తెలియ‌దు.జంతువులు ఒక‌దాన్ని మ‌రొక‌టి తినేందుకు నిత్యం కాచుకుని చూస్తుంటాయి.

ఏ మాత్రం పొర‌పాటు చేసిన ప్ర‌త్య‌ర్థి జంతువుకు బ‌లైపోవ‌డం ఖాయం.అయితే జంతువుల్లో కూడా అనేక ర‌కాలు ఉన్ఆన‌యి.

చాలా వ‌ర‌కు సైజుల‌తో సంబంధం లేకుండా బ‌లంగా ఉంటాయి.కొన్ని ఎంత పెద్ద‌గా ఉన్నా బ‌ల నిరూపన విష‌యానికి వ‌స్తే అవి తేలిపోతాయి.

ఆకారం పెద్ద‌గా ఉన్నా భ‌య‌ప‌డుతుంటాయి కొన్ని జంతువులు.
క్రూర జంతువులను కూడా త‌రిమికొట్టే అతి చిన్న జంతువు ఏదైనా ఉందా అంటే అది హనీ బ్యాడ్జర్ అనే చెప్పాలి.

చూసేందుకు ఆకారం చిన్నగానే ఉన్నా దాని ధైర్యం ఇంకెవ‌రికీ ఉండ‌దేమో.ప్ర‌పంచంలోనే అత్యంత ధైర్య‌శాలిగా దానికి పేరుంది.అది ఎంత‌టి ప్ర‌త్య‌ర్థుల‌ను అయినా ఎంత‌టి క్రూర జంతువుల‌ను అయినా ప‌రిగెత్తిస్తుంది.కాగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

ఇందులో ఓ కొండ చిలువ దాన్ని తిందామ‌ని చూస్తుంది.హనీ బ్యాడ్జర్‌‌ను బ‌లంగా చుట్టేసి మింగేద్దామ‌ని చూస్తుంది.

కానీ వీటి చ‌ర్మం అత్యంత ఎలాస్టిక్ గా ఉంటుంది.అంతే కాకుండా ప‌దునైన ప‌ళ్లు కూడా ఉంటాయి.వీటి సాయంతోనే ఆ కొండ చిలువ బారి నుంచి సునాయాసంగా త‌ప్పించుకుంటుంది హనీ బ్యాడ్జర్‌.ఇక ఆ కొండ చిలువ‌ను చీల్చి చెండాడుతుంది.త‌న ప‌దునైన పళ్ల‌తో దాన్ని కొరికి పారేస్తుంది.ఇక్క‌డ ట్విస్టు ఏంటంటే అక్క‌డ‌కు రెండు న‌క్క‌లు వ‌చ్చి హ‌రీ బ్యాడ్జర్ వేటాడటానికి ప్రయత్నిస్తాయి.

కానీ అది మాత్రం భ‌య‌ప‌డ‌కుండా మూడింటినీ ముప్పుతిప్ప‌లు పెడుతుంది.కొండ చిలువ‌కు అయితే కొరుకుతూ చిత్ర హింస‌లు పెడుతుంది.

ఇక తాపీగా అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube